రియో అందాలు..

Rio-2016-Olympics-beauty

ఒలింపిక్స్ కోసం రియో నగరం అందంగా ముస్తాబైంది. సమస్యలను అధిగమిస్తూ, వివిధ దేశాల నుంచి వచ్చే అథ్లెట్లు, అధికారులు, అభిమానులకు ఆతిథ్యమివ్వడానికి సిద్ధమైంది. కుడివైపు టూ బ్రదర్స్, ఎడమ వైపు కోర్కొవాడో, మధ్యన సుగర్‌లూఫ్ పర్వత శ్రేణులు అందంగా కనిపిస్తుంటే, క్రీస్ట్ ది రిడీమర్ భారీ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. బొటాలొగో తీరం రియో ప్రాధాన్యతను మరింత పెంచుతున్నది.

మున్సిపాలిటీలో 1,221 కిలోమీటర్లు, మెట్రోలో 4,557 కిలోమీటర్ల విస్తీర్ణంగల రియో జనాభా సుమారు 65 లక్షలు. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు 207 దేశాలకు చెందిన 10,500 మంది అథ్లెట్లు ఇప్పటికే రియో చేరుకున్నారు. దాదాపు అదే సంఖ్యలో అధికారులు, అభిమానులు కూడా రియోలో అడుగుపెడుతున్నారు. ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ ఒలింపిక్స్‌ను విజయవంతం చేసేందుకు బ్రెజిల్ సర్కారు కృతనిశ్చయంతో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here