ఓం నమో వేంకటేశాయ రివ్యూ

168
Spread the love

 Posted [relativedate]om namo venkatesaya movie review

చిత్రం: ఓం నమో వేంకటేశాయ 
తారాగణం: నాగార్జున, సౌరభ్‌జైన్‌, అనుష్క,  ప్రగ్యాజైస్వాల్‌, జగపతిబాబు, రావు రమేష్‌

సంగీతం: ఎం.ఎం. కీరవాణి 
ఛాయాగ్రహణం: ఎస్‌.గోపాల్‌రెడ్డి 
కథ, మాటలు:  జె.కె.భారవి 
నిర్మాత: మహేశ్‌రెడ్డి 
దర్శకత్వం: రాఘవేంద్రరావు 
విడుదల: 10-02-2017

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున… హతీరాం బాబాగా,  సౌరభ్‌ జైన్‌..  శ్రీనివాసుడిగా  నటించిన చిత్రం ఓ నమో వెంకటేశాయ. హతీరాం బాబా జీవితకధ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క, ప్రగ్యాజైస్వాల్‌,  జగపతిబాబు, రావురమేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నమయ్య, శ్రీరామదాసు వంటి బిగ్గెస్ట్  సినిమాలను అందించిన నాగార్జున, రాఘవేంద్రరావు కాంబోలో ఓం నమో వేంకటేశాయ సినిమా తెరకెక్కడంతో ఈసినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ భక్తిరస చిత్రం ఆధ్యాత్మక భావాన్ని కలిగించిందో లేదో  చూద్దాం.  

ఇక కధలోకి వెళ్తే..

ఈ సినిమాలో నాగ్.. రామ్ గా,అనూష్క.. కృష్ణమ్మ, ప్రగ్యాజైస్వాల్‌.. భవానీగా నటించారు.  

రామ్ కి చిన్న తనం నుండి దేవుడ్ని చూడాలన్న కోరిక ఉంటుంది. తిరుమలలోని పద్మానంద స్వామి వద్ద ఆ విద్య నేర్చుకుని  దేవుడి కోసం తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చి శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రత్యక్షమవుతాడు. కానీ అప్పుడు  దేవుడ్ని గుర్తించలేని రామ్ తరువాత తనకు కనిపించింది దేవుడే అని తెలుసుకుని మళ్ళీ దేవుని చెంతకు వెళ్లాలని ప్రయత్నిస్తాడు. కానీ అక్కడున్న కొంతమంది దుర్మార్గుల వలన దేవుడిని చేరుకోలేకపోతాడు. కృష్ణమ్మ అనే భక్తురాలితో కలిసి తిరుమల క్షేత్రంలో జరుగుతున్న అన్యాయాలను అడ్డుకుని, క్షేత్రాన్ని వైకుంఠంగా అభివృద్ధి చేస్తూంటాడు రామ్. మరో పక్క భవానీ.. రామ్ ని పెళ్లిచేసుకోవాలనుకుంటుంది. మరి ఆ పరమ భక్తుడికి స్వామి దర్శన భాగ్యం కలిగిందా? తిరుమలలో ఆలయ అధికారి గోవిందరాజులు రామ్ పై ఎందుకు కక్ష కట్టాడు? రామను పరీక్షించేందుకు స్వామి ఏం చేశాడు?  పెళ్లి చేసుకోవాలనుకున్న భవానీ..  రామ్ కోసం ఎలాంటి త్యాగం చేస్తుంది. రామ్..  హాతిరామ్ బాబా ఎలా అయ్యాడు ? అన్న ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలనుకుంటే సినిమాను వెండితెరపై చూడాల్సిందే.

ఇక కధనం ఏంటంటే..

శ్రీనివాసుడ్ని ప్రత్యక్షంగా చూడాలంటూ చిన్న తనం లోనే బయటకొచ్చిన హథీరాం తిరుమలను కలియుగ వైకుంఠంగా మార్చడంలో చేసిన కృషి ఎలాంటిది? స్వామి వారి చేతుల మీదుగానే హధీరాం సజీవ సమాధి ఎలా అయ్యాడు అన్నదే ఓం నమో వేంకటేశాయ సినిమా. వేంకటాచల స్థలపురాణం, హథీరాంబాబా, కృష్ణమ్మల భక్తి నేపథ్యంలో ఫస్టాఫ్ నడుస్తుంది. ఇక సెకండాఫ్ లో స్వామివారి ఆభరణాలను దోచాడనే నింద హథీరాం బాబాపై పడుతుంది. ఆ నిందను తొలగించుకునేందుకు హథీరాం బాబా ఏం చేశాడు? ఆ ఊరి రాజు..  హథీరాంబాబాకి పెట్టిన పరీక్ష నుంచి గట్టెక్కించేందుకు వైకుంఠం నుండి దిగి వచ్చిన ఆ స్వామివారు ఏం చేశారు అనే అంశాలు అలరిస్తాయి.

ఇక ఎవరు ఎలా చేశారో విందాం..

నాగార్జున నటన ఆరంభం నుండి చివరి దాకా ప్రతి సన్నివేశానికి జీవం పోసింది. కళ్ళలో ఉట్టిపడే భక్తి భావం, మాటల్లో ఆర్ద్రత బాగా ఆకట్టుకున్నాయి. ఒక అగ్ర హీరోలా కాకుండా పరమ భక్తుడిగానే కనిపించారాయన. వేంకటేశ్వర స్వామి పాత్ర ధరించిన సౌరభ్ రాజ్ జైన్ ఆ పాత్రకు ప్రాణం పోశాడు. ముఖ కవళికల్లో, మాటల్లో భక్తుల పట్ల ఆదరణను ప్రస్ఫుటంగా ప్రదర్శిస్తూ దేవుడినే చూస్తున్న భావన కలిగించాడు. రాఘవేంద్రరావు  భక్తి రస చిత్రాలను తెరకెక్కించడంలో తనకు సాటి లేదని మరోసారి నిరూపించారు. కృష్ణమ్మ  పాత్రలో అనూష్క  వేంకటేశ్వరస్వామి భక్తురాలిగా పవిత్రత ఉట్టిపడేలా తెరపై కన్పించింది.  కె.కె. భారవి అందించిన కథ కాస్త కల్పితమే అయినా కూడా మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియజెప్పింది. ఎస్.గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ  సినిమాకి అదనపు  ఆకర్షణగా నిలిచింది.

ప్లస్ పాయింట్స్:
కథ, కథనం 
 నటీనటులు 
 సంగీతం 
 ఛాయాగ్రహణం 
 పతాక సన్నివేశాలు

నెగిటివ్ పాయింట్స్:

గుజరాతీ వ్యక్తి అయిన హాథిరామ్ బాబాను తెలుగువాడిగా చూపించడం

ఆఖరి పంచ్:

 ఓం నమో వేంకటేశాయ…  భక్తిభావాన్ని తట్టిలేపుతోంది.

Telugu Bullet Rating: 3.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here