ఆ తప్పులో అద్వానీ కి వాజ్ పేయ్ తోడు..?

Posted April 20, 2017

once again wants to do babri masjid issue1992 డిసెంబర్ 6న బీజేపీ అగ్రనేతలు ఇచ్చిన ఈ నినాదమే బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసింది. బాబ్రీ మసీదు కూల్చివేతపై నిజానిజాలు తేల్చడానికి ఏర్పాటుచేయబడ్డ లిబర్హన్ కమిషన్ తన నివేదికలో బీజేపీనే వేలెత్తి చూపింది. అద్వానీ రథయాత్రతోనే అసలు కథ మొదలైందని చెప్పింది. లక్షన్నర మంది కరసేవకుల్ని అయోధ్య రప్పించిన అద్వానీ.. రెచ్చగొట్టే ప్రసంగాలతో మసీదూ కూలగొట్టించారని ఆరోపించింది. అందుకే అప్పట్నుంచి అద్వానీని బాబ్రీ కేసు నీడలా వెంటాడుతోంది.

అప్పటి యూపీ సీఎం కల్యాణ్ సింగ్ కూడా ఆరెస్సెస్ సూచనల మేరకు నడుచుకున్నారని లిబర్హాన్ కమిషన్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. మసీదు కూల్చివేత సమయంలో సైలంట్ గా ఉండాలని ఐఏఎస్, ఐపీఎస్ లకు కల్యాణ్ ఆదేశాలిచ్చినట్లు చెప్పింది. అందుకే పోలీసులు కూడా ఘటనాస్థలానికి ఆలస్యంగా వచ్చారని, ఆ తర్వాత కూడా అదనపు బలగాలు దిగకుండా అద్వానీ పిలుపు మేరకు కరసేవకులు ఘజియాబాద్ రహదారిని దిగ్భంధించారని చెప్పింది కమిషన్. ముఖ్యంగా ఉమాభారతి మసీదు కూల్చివేతలో కీలక పాత్ర పోషించారు.

ఏక్ దక్కా ఔర్ దో.. బాబ్రీ మసీద్ తోడ్ దో అంటూ కరసేవకుల్ని రెచ్చగొట్టారు ఉమా. ఈమెకు తోడు వినయ్ కతియార్, గిరిరాజ్ కిషోర్, అశోక్ సింఘాల్, సాధ్వి రితింబర తమ రెచ్చగొట్టే ప్రసంగాలతో కరసేవకుల్ని ఉసిగొల్పారు. కరసేవ అంటే భజన కీర్తనలు కాదని, రామ మందిర నిర్మాణమని అద్వానీ చెప్పినట్లు కమిషన్ స్పష్టం చేసింది. కూల్చివేతకు నాలుగు రోజులక్రితమే మందిర నిర్మాణం కోసం చట్టాన్ని ఉల్లంఘిస్తామన్న అద్వానీ ప్రకటనను గుర్తుచేసింది. అయితే లిబర్హన్ కమిషన్ మాజీ ప్రధాని వాజ్ పేయినీ వదల్లేదు. ఆయన కూడా పరోక్షంగా సిద్ధాంత సహకారం అందించారని ఆరోపించింది.

SHARE