ఆ కంప్యూటర్ కాస్ట్ 5 డాలర్స్ ….

 onion omega computer cost five dollarsప్రపంచంలోనే అతి చిన్న కంప్యూటర్ ఇపుడు మార్కెట్లోకి వచ్చింది. “ఆనియన్ ఒమేగా 2” అని పిలిచే ఈ కంప్యూటర్ ఖరీదు కేవలం ఐదు డాలర్లు మాత్రమే. నిరుడు విడుదల చేసిన ఒమేగా ను మరికాస్త కుదించి అదనపు ఫీచర్స్ తో దీన్ని డెవలప్ చేశారు. ఇప్పటికే ప్రపంచంలో అతి చిన్న కంప్యూటర్ గా పేరొందిన రాస్ బెర్రీ పై జీరో కు ఇది పోటీ.. దీని ధర కూడా ఐదు డాలర్లు కావడం విశేషం. అయితే ఈ రెండూ హ్యాక్ ప్రూఫ్ కాదు..

దీని స్పెసిఫికేషన్స్ ఇవీ..

లీనక్స్ ఆపరేటింగ్ సిస్టం
580 మెగా హెర్ట్జ్ సీపీయూ
64 ఎంబి మెమరీ
16ఎంబి స్టోరేజి
ఇన్ బిల్ట్ వై ఫై
యూఎస్ బీ సాయంతో మానిటర్ కు కనెక్ట్ చేసుకునే వీలు
ఆనియన్ క్లౌడ్ పేరిట క్లౌడ్ బేస్డ్ ఫీచర్

SHARE