2.0 టైటిల్ కు అంత కథ నడిచిందా..!

Posted November 19, 2016

Only 2.0 Title For Robo Sequel Not Robo 2.0.ఇప్పటివరకు సౌత్ ఇండియాలోనే కాదు భారత దేశ సిని చరిత్రలో కూడా 340 కోట్ల బడ్జెట్ తో ఓ సినిమా నిర్మించడం జరుగలేదు. అయితే శంకర్, రజినికాంత్ లు అంత బడ్జెట్ తో రోబో సీక్వల్ సినిమా చేస్తున్నారు. ఈ సీక్వల్ కు రోబో 2.0 అని టైటిల్ పెట్టారు. అయితే రీసెంట్ గా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ లో కేవలం 2.0 మాత్రమే ఉంది ఆ టైటిల్ కింద రోబోగా రజిని షాడో ఉంది. సో రోబో సీకల్ గా అందరు అనుకుంటున్నట్టు రోబో 2.0 కాకుండా కేవలం 2.0 గా వస్తున్నారు.

అయితే రోబో అని టైటిల్ లో ఎందుకు మెన్షన్ చేయట్లేదు అంటే రోబో నిర్మాత కళానిధి మారన్ ఏమన్నా గొడవ చేస్తాడేమో అన్న ఆలోచనతో ఈ నిర్ణయానికి వచ్చారట. ఆయనతో మాట్లాడి కూడా చేసేయొచ్చు రోబో 2.0 కన్నా 2.0 అన్న టైటిల్ కే ఎక్కువ క్రేజ్ ఉంటుందని ఈ ప్లాన్ చేశారు. సో టైటిల్ వెనుక ఇంత కథ నడిచిందన్నమాట. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అవుతుందని టాక్.

ఇక కబాలితో మరోసారి తన స్టామినా ఏంటో చూపించిన రజిని ఆ సినిమా కన్నా భారీ ప్రమోషన్స్ తో ఈ 2.0 ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తెలుగులో కూడా భరీగానే రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

SHARE