Posted [relativedate]
అక్కినేని వారసుడు అఖిల్ పెళ్లికి సిద్ధమవుతున్నాడు జివికె మనవరాలు శ్రీయా భూపాల్ తో ఈ నెల 9న నిశ్చితార్ధం జరుగనుంది. అయితే ఈ కార్యక్రమానికి కేవలం ఇరుకుటుంబ సభ్యులతో పాటుగా కేవలం 40 మంది అతిథులు మాత్రమే వచ్చేలా చూస్తున్నారట. వారికే ఇన్విటేషన్ అందించారట. ఆ 40 మందిలో కూడా సిని రాజకీయ ప్రముఖులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అఖిల్ ఎంగేజ్మెంట్ అంటే సిని పరిశ్రమ అంతా తరలివస్తుంది. కాని పెళ్లి ఎలాగు ఇటలీలో జరుగుతుంది కాబట్టి ఆ తర్వాత రిసెప్షన్ గ్రాండ్ గా అందరిని ఇన్వైట్ చేసి పెద్ద పార్టీ జరుపుతారట ఇక ఇప్పుడు జరిగే ఎంగేజ్మెంట్ కు మాత్రం చాలా తక్కువమందిని ఆహ్వానిస్తున్నారట.
అఖిల్ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన అఖిల్ మొదటి సినిమా ఫలితం ఎలా ఉన్నా తనలోని ఎనర్జీతో అందరిని ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం విక్రం కె కుమార్ తో తన రెండో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు. నిశ్చితార్ధం తర్వాత అఖిల్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తాడని అంటున్నారు.