స్మార్ట్ఫోన్ రంగంలో రారాజుగా వెలుగుతున్న సామ్సంగ్కు గెలాక్సీ నోట్7 ఎక్కడలేని ఇబ్బందులు తెచ్చిపెట్టింది.. ఒకవైపు ఆర్థికంగా పెద్ద తగిలినా సంస్థపైనా.. వారి ఉత్పత్తులపైనా తీవ్రమైన వ్యతిరేకతా భావం కలిగి భారీగా నష్టపోయింది.. ఇప్పుడు ఈ మొబైల్ని ఎవరి చేతులో కూడా ఉండనీయకుండా చేసేందుకు సంస్థ కంకణం కట్టుకుంది .. ఆ క్రమంలోనే కొత్తగా ఒక అప్డేట్ ఇవ్వబోతుంది. దాని వల్ల కేవలం 60 శాతమే ఛార్జింగ్ అయి ఆగిపోతుంది. దానితోపాటు కొన్ని గంటల కొకసారి రీబూట్ చేయమంటూ నోటిఫికేషన్ ఇస్తూనే ఉంటుంది. ఇలా చేయడం వల్ల ప్రతి సారి ఆ వినియోగదారుడికి తిరిగి ఇచ్చేందుకు ఆసక్తి చూపుతారని కంపెనీ భావిస్తుంది.. ఒక వేళ ఇవ్వకపోయినా.. కనీసం పేలేందుకు ఆస్కారం దాదాపు తగ్గిపోతుందని అంచనా వేస్తుంది.. మీ రక్షణ కోసమ కాపోయినా వేరే వారి కోసమైనా మొబైల్ తిరిగి ఇచ్చేయాలని కోరుతుంది.
ఇప్పటికే అమెరికాలో దాదాపు 85 శాతం యూజర్లు తిరిగి ఇచ్చేసినట్లు సంస్థ పేర్కొంది.. వారు మరో కొత్త సామ్సంగ్ తీసుకునేందుకు ఇష్టపడుతున్నట్లు తెలిపింది. ఒక వేళ వారు కోరుకుంటే నగదు చెల్లించడానికి కూడా సుముఖంగా ఉన్నామని.. లేదా నోట్8 కొనేవారి జాబితాలో ఉండొచ్చని వివరించింది. ఇప్పటి వరకు పేలుడుకు కారణమేంటో తమ శాస్త్రవేత్తలు కనుగొనలేకపోయారని ఆవేదన కూడా వ్యక ్తం చేసింది.. అందుకే మీ దగ్గర నోట్7 ఉంటే వెంటనే మార్చేసుకోండి మరి…