మరో వారం రోజులే మోడీ కి గడువు…

0
226
only one week for modi

Posted [relativedate]

only one week for modi
నోట్ల రద్దు ను ప్రకటించి అప్పుడే 43 రోజులు గడిచి పోయాయి.మోడీ చెప్పిన గడువు మరో వారమే వుంది మీడియా లో వారం ముందే డెడ్ లైన్ న్యూస్ వచ్చేస్తోంది ..మోడీ గెలిచారా? ఓడిపోయారా?అనేది తేలి పోవడానికి వారమే గడువుంది అని …..50 రోజులు ఓపిక పట్టండి మీకు కష్టాలే లేకుండా చేస్తా అని ప్రధాని మోడీ చెప్పారు యావత్ ప్రపంచం చూపు ఇప్పుడు అయన వైపే వుంది. కానీ ప్రస్తుత పరిస్థితి కొంత అదుపులో వున్నట్టే ఉన్నా మోడీ చెప్పినట్టు మాత్రం 50 రోజుల్లో మాత్రం అదుపులోకి రాలేదేమో అనే చెప్పొచ్చు. ఇంకా బ్యాంకుల ముందు క్యూ లు, ఎటిఎం ల ముందు క్యూ లు అలానే వున్నాయి..పరిస్థితిలో చెప్ప్పుకో తగ్గ మార్పులు రాలేదు. ఇదిలా ఉండగా దేశం లో భారీగా నల్లడబ్బు పట్టు బడటం అది కూడా కొత్త కరెన్సీ నోట్లే కావడం బట్టి చుస్తే అవినీతి ఏస్థాయి లో ఉందొ ఎవర్ని అడిగిన చెప్తారు. నిన్న మొన్న పట్టుపడిన శేఖర రెడ్డి, సి.ఎస్ రామ్మోహన రావు వంటివారినే చూస్తే పరిస్థితిలో అసలు మార్పువస్తుందా అనే అనుమానం రాక మానదు.

నిజం గా దేవుడు దిగొచ్చి అద్భుతం జరిగితే తప్ప మరో దారి లేదు ఇప్పట్లో బ్యాంకు లు ఎటిఎం లు పూర్తిగా అందుబాటులోకి వస్తే మినహా మార్గం లేదు. ఎటిఎం లు అందుబాటులోకి రావాలిఅంటే శేఖర్ రెడ్డి, రామ్మోహన్ వంటి నల్ల కుబేరులకు డబ్బు వెళ్లకుండా చూడాలి. నగదు ముద్రించే కేంద్రాల నుంచి డైరెక్ట్ గా కుబేరుల ఇళ్లకే వెళ్తుంటే మోడీ ఒక్కడు వుంది చేసేదేం లేదు అనే డౌట్ రక మానదు .ఐతే టాక్స్ కట్టేందుకు మరో మూడు నెలలు సమయం వుంది కాబట్టి మోడీ ఆశయం నెరవేరే అవకాశం వుంది.. రద్దు నిర్ణయం మంచిదే ఐనా భంగపాటు తప్పేలా లేదు….ప్రస్తుత పరిస్థితి ని బట్టి ..అంతే కాదు ప్రతిపక్షాల దాడికి కూడా సిద్ధం గా వుండాలిసిన అవసరం కూడా వుంది .

Leave a Reply