ఒపెరా వినియోగదారులకు వార్తలపైనే ఆసక్తి

Posted November 8, 2016

opera users is interested in news

  • టాప్‌ 100 సైట్లలో 31 శాతం వార్తాసైట్లే
  • 50 శాతం పేస్‌బుక్‌లో ఎక్కువగా గడుపుతున్నారు
  • శోధనలో 80 శాతం మంది గూగుల్‌కే పట్టం
  • ఒపెరా వార్షిక నివేదికలో ఆసక్తిక అంశాలు
  • ఒపెరా వెబ్‌బ్రౌజర్‌ సంస్థ ఇండియాలో మొబైల్‌ ట్రెండ్స్‌ ఎలా ఉన్నాయి అనే దానిపై జూన్‌ 2015 నుంచి మే 2016 వరకు వార్షిక నివేదిక చాలా ఆసక్తి కర విషయాలను వెల్లడించింది…. దేశంలో తమ వెబ్‌బ్రౌజర్‌ వాడుతున్న 50 మిలియన్ల మందిపై అధ్యయనం చేసి వివరాలు వెల్లడించారు. విడుదల చేసింది.. ప్రతి పది మందిలో 8 మంది గూగుల్‌ వాడుతున్నారు. 50 శాతానికిపైగా వినియోగదారులు ఫేస్‌బుక్‌లోనే కాలక్షేపం చేస్తున్నట్లు తెలిపే ఆ నివేదిక మిగిలిన అంశాలు పరిశీలిద్దామా…

opera users is interested in news
– ప్రతి పది మంది ఒపెరా మిని యూజర్లలో 8 మంది గూగుల్‌ సైట్‌ వాడుతున్నారు
– మొదట గూగుల్‌ ఓపెన్‌ చేసి కావాల్సిన సైట్లలోకి వెళ్లే వారు 88 శాతం ఉన్నారు
– గూగుల్‌ నుంచి ఎక్కువగా వెళ్లే వారు ఎక్కువగా వార్తలు, డౌన్‌లోడ్‌ సైట్లకే వెళుతున్నారు.
– ఎక్కువ మంది ఆన్‌లైన్‌లో సోషల్‌ నెట్‌వర్కింగ్‌లో ఎక్కువ శాతం గడుపుతున్నారు
వాటిలో తొలి స్థానం ఫేస్‌బుక్‌, క్వారా, బ్లాగర్‌, ట్విట్టర్‌ సైట్లు ప్రధానమైనవి
– మొత్తం యూజర్లలో 50 శాతం మంది ఫేస్‌బుక్‌ వినియోగిస్తున్నారు
– విద్యా సమాచారం కోసం వెతికే వారు ఎక్కువగా పరీక్షా ఫలితాల కోసం చూసే వారు ఉన్నారు. టాప్‌ 100 సైట్లలో ఎడ్యుకేషన్‌ సైట్లు 10 ఉన్నాయి
– వార్తా వెబ్‌సైట్లు రెండో మోస్ట్‌ పాపులర్‌గా నిలిచాయి. ఎక్కువ మంది వినియోగదారులు వార్తా వెబ్‌సైట్లు ఓపెన్‌ చేయడానికి ఇష్టపడుతునన్నారు. వాటిలో హిందీ సైట్లే అధికం
– ఈ కామర్స్‌ వెబ్‌సైట్లలో ఎక్కువగా మొబైల్‌ కొనుగోళ్ల కోసమే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.
– వీడియో వెబ్‌సైట్లలో యూట్యూబే అగ్రస్థానం నిలబెట్టుకుంది. ఆ తరవాత యుక్లిప్‌, డైలీ మోషన్‌, హాట్‌ స్టార్‌ పై మక్కువ చూపుతున్నారు. టాప్‌ 100లో వీటికి స్థానం
– మ్యూజిక్‌ సైట్ల కోసం వెతికే వారు వాటిని ఎక్కువగా డౌన్‌లోడ్‌ కోసమే వినియోగిస్తున్నారు.
– టాప్‌ 100 సైట్లలో డౌన్‌లోడ్‌ సైట్లు 24 ఉంటే వాటిలో 75 శాతం మ్యూజిక్‌ కోసమే వాడుతున్నారు.
– ఒపేరా కంప్రెషన్‌ పరిజ్ఞానంతో వెబ్‌సైట్లు అసలు డాటా కంటే 90 శాతం వినియోగాన్ని ఆదా చేసి కేవలం 10 శాతం డాటాని వినియోగించేలా చేస్తుందని సంస్థ ప్రకటించింది.
– ఓపెరా మిని వాడే 50 మిలియన్ల వినియోగదారులకు డాటా సేవింగ్స్‌లో దాదాపు రూ.690 ఆదా చేసినట్లు సంస్థ ప్రకటించింది 36కిలో టెరాబైట్స్‌.. ఇండియాలో సగటు ధర ఆధారంగా ఆదా ఎంతయ్యిందనేది అంచనా వేశారు

opera users is interested in news
టాప్‌ 20 వెబ్‌సైట్లు
1 గూగుల్‌
2 ఫేస్‌బుక్‌
3 యూట్యూబ్‌
4 క్రిక్‌బజ్‌
5 వికిపీడియా
6 బ్లాగర్‌
7 అమేజాన్‌
8 ఎన్‌డీటీవీ
9 ట్విట్టర్‌
10 ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌
11 ఇన్‌.కాం
12 యు క్లిప్స్‌
13 వర్డ్‌ప్రెస్‌
14 మౌజ్‌
15 పింటెరెస్ట్‌
16 జార్గాన్‌ జోష్‌
17 ఏబీవీ న్యూస్‌సైట్‌
18 స్నాప్‌డీల్‌
19 ఇండియా టైమ్స్‌
20 ఇండియా. కాం

టాప్‌ 100 వెబ్‌సైట్లలో కేటగిరీల వారీగా..
వార్తల వెబ్‌సైట్లు 31
డౌన్‌లోడ్‌ సైట్లు 24
ఎడ్యుకేషన్‌ సైట్లు 10
సోషల్‌ నెట్‌వర్కింగ్‌ 10
ఈ కామర్స్‌ 9
వీడియో 4
సెర్చ్‌ 3
ట్రావెల్‌ 3
జాబ్స్‌ 2
ఇతరాలు 4

SHARE