ఆపరేషన్ కొడాలి సక్సెస్..గుడివాడలోలోకేష్ ?

0
461
operation kodali success lokesh race in gudivada

Posted [relativedate]

operation kodali success lokesh race in gudivada
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వర్సెస్ టీడీపీ హైకమాండ్..నాని వైసీపీ లో చేరినప్పటినుంచే ఈ రసవత్తర పోరుకి రంగం సిద్ధమైంది.2014 ఎన్నికల్లో ఎంత ప్రయత్నించినా ,కృష్ణా జిల్లాలో టీడీపీ గాలి తోలినప్పటికీ కొడాలి విషయాన్ని మాత్రం ఆపలేకపోయింది.ఎన్నికల తర్వాత అసెంబ్లీ వేదికగా కొడాలి నాని రెచ్చిపోవడాన్ని,చంద్రబాబుని టార్గెట్ చేస్తూ నోరు పారేసుకోవడాన్ని టీడీపీ ..స్పెషల్ గా లోకేష్ ఓ సవాల్ గా తీసుకున్నారు.అప్పటినుంచి ఆపరేషన్ కొడాలి నాని స్టార్ట్ అయ్యింది.నానిని దెబ్బకొట్టి ఎన్టీఆర్ సొంతగడ్డ లాంటి గుడివాడలో టీడీపీ జెండా రెపరెపలాడించడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ ముందుకు నడిచింది.అందులో ఫస్ట్ షాట్ కి కొడాలి దిమ్మతిరిగింది.గుడివాడ మునిసిపల్ చైర్మన్ సహా 9 మంది కౌన్సిలర్లు వైసీపీ ని వీడి టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.కొన్ని నెలల కిందట జరిగిన ఈ పరిణామం కొడాలి నానికి పెద్ద షాక్.తన ముఖ్య అనుచరులు అనుకున్నవాళ్ళు ఇలా పార్టీ మారడం నాని కి ఊహించని ఎదురు దెబ్బ.

ఇంతలోనే మరో ఇబ్బంది ముంచుకు వచ్చింది.గుడివాడ మున్సిపాలిటీ 19 వ వార్డు మెంబర్ అనారోగ్యంతో చనిపోయారు.దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.పైగా ఇది నానికి కంచుకోట లాంటి వార్డ్.అక్కడ గెలిచి నానికి తమ సత్తా చాటాలని టీడీపీ తహతహలాడింది.అందుకు తగ్గట్టే హైకమాండ్ కూడా పూర్తి స్థాయిలో సహకరించింది.లోకేష్ స్పెషల్ కేర్ తీసుకుని ఎన్నికల ప్లానింగ్ లో ఇన్వాల్వ్ అయ్యారు.దీంతో నాని కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.డబ్బు వరదలై పారింది.ఎన్నికలు అయ్యాయి.ఫలితాలు వచ్చాయి.అధికార పార్టీకి చెందిన నండూరి వెంకట ప్రసాద్ వైసీపీ అభ్యర్థి మీద 150 ఓట్ల తేడాతో గెలుపొందారు.నాని కంచుకోటలో టీడీపీ జెండా రెపరెపలాడింది.వైసీపీ శ్రేణులు ముఖ్యంగా నాని అభిమాన గణం ఈ ఫలితం చూసి నివ్వెరపోయింది.

దీంతో ఆపరేషన్ కొడాలి నాని ఇప్పటికి సక్సెస్ అయ్యింది.వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఈ స్థానాన్ని గెలుచుకుంటే అది పూర్తి స్థాయిలో విజయవంతం అయినట్టని లోకేష్ భావిస్తున్నారట.వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి సీఎం చంద్రబాబు కుటుంబం నుంచి అంటే లోకేష్ లేదా బ్రాహ్మణి ఈ స్థానంలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Leave a Reply