బంద్ సక్సెస్ ఎందుకు కాలేదంటే..?

109

Posted November 28, 2016, 4:06 pm

Image result for bharath bundh fail reason

పెద్ద నోట్లు రద్దు కారణం గా ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు అంటూ అటు ఉభయ సభల్లో ఇటు ప్రజా జీవనం లో నెత్తి నోరు బాదు కున్న ప్రతిపక్షాలు చివరకు ఆఖరి అస్త్రం గా బంద్ కి కూడా పిలుపునిచ్చాయి …కట్ చేస్తే బంద్ లేదు ఏమి లేదు ..అంతా సాదా గా ఒక మాట లో చెప్పాలంటే అసలు జనం పట్టించుకోలేదని చెప్పాలి.

నల్ల ధనాన్ని వెలికి తీస్తాం అంటూ రాత్రికి రాత్రి  ప్రధాని మోడీ నోట్ల రద్దు ప్రకటన చేసిన మొదట్లో కొంత ప్రజల్లో ఆందోళన ఏర్పడినా, అక్కడక్కడా ఒకరిద్దరు మృతి చెందిన ఘటనలు మినహా  చెప్పుకోదగ్గ నష్టాలేవి జరగలేదు  .ఇంకా చెప్పాలంటే జన్ ధన్ , తదితర ప్రభుత్వ సంస్థలు జేబు నింపుకొని ఊపిరి పీలుచుకున్నాయి . అసలు ఇలా జమ ఐన మొత్తం అంతా నల్ల కుబేరుల బీరువాలో , నేల మాగాణుల్లో  మూలుగుతూ రద్దు దెబ్బ కి బైటికొచ్చిన బాపతు సొమ్మే . ఐతే ఇలా వచ్చిన సొమ్మును కూడా ప్రభుత్వం జన్ ధన్, జీరో అకౌంట్ ఖాతాల్లో వేసే యోచనలో వుంది. 

Image result for bharath bundh fail reason

రద్దు నాటినుంచి నేటికీ 20 రోజులు గడిచినా ప్రజల్లో స్వతహాగా అసహనం లేదు కదా ఈ పని ఎప్పుడో చేయాల్సింది అనే అభిప్రాయం వ్యక్తమైంది అనేందుకు బంద్ విఫలం కావడమేప్రజలు ఎప్పుడు విజ్ఞులే అనడానికి ఇదే ఉదాహరణ , కేవలం రాజకీయ పార్టీల మనుగడ కోసం ఇటువంటి అస్త్రాలు వాడటం మినహా మరే ఇతర ప్రయోజనం ఉండదు అని వారికీ తెలుసు ఐనా ఇదంతా మనుగడ ప్రచారం ఉనికి ఈ మూడింటి కొసమే.

Image result for bharat bandh fail reason

కేవలం ఆటోలు మాత్రమే తిరగ లేదు ట్రేడ్ యూనియన్ ల ఒత్తిడి కి తలొగ్గి ఆటోలను తిప్పలేదు తప్ప వారి పొట్టను వారే కొట్టుకోవాలి అనే పరిస్థితి నేడు లేదు , బస్సు, రైల్  విమానము  ఇవెందు కు రద్దు కాలేదు  కేవలం ఆటో లే ఎందుకు రద్దయ్యే పరిస్థితి , ఆ సోదరులు కూడా కళ్ళు తెరిచారు ఏమో తర్వాత అవి కూడా రోడ్ మీద కి వచ్చాయి. మొత్తంగా  గా బంద్ విఫలం పరిస్థితి చుస్తే ఎక్కడా ప్రజల్లో రద్దు పై అసహనం లేదనే చెప్పాలి. మీ జీవితాలు బాగు చేస్తాం అంటే కొద్దీ రోజులు ఇబ్బదులు ఐన పడతారు తప్ప అభివృద్ధిని అడ్డుకోరు సగటు భారతతీయులు అనేందు కు ఇదే ఉదాహరణ అనుకోవచ్చు  …!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here