ప్రతిపక్షాలు… ఫూలిష్ గేమ్ ఆడతాయా!

0
564
opposition parties foolish game

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

opposition parties foolish gameరాష్ట్రపతి ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగితే మేలనే మాట క్రమంగా ఎన్డీయేతర పక్షాల నుంచి వినిపిస్తోంది. మొన్న టీఆర్ఎస్, నిన్న జగన్, ఇప్పుడు నితీష్ కుమార్ లు దాదాపు ఈ రకమైన మాటనే మాట్లాడుతున్నారు. తాము ఎన్డీయే అభ్యర్థికి మద్దతునిస్తామని టీఆర్ఎస్ ప్రకటించగా, జగన్ కూడా అదే మాటే చెప్పాడు. ఇక నితీష్ కుమార్ సూటిగా ఆ మాట చెప్పలేదు కానీ, ఏకగ్రీవంగా ముగిస్తే మేలేమో.. అన్నారు.

ప్రణబ్ ముఖర్జీని మరోసారి కొనసాగించాలనే మాటను కూడా నితీశ్ మాట్లాడినా.. అది ఏమాత్రం జరిగే పని కాదనేది చిన్న పిల్లాడికైనా స్పష్టం అవుతుంది. సామాదానబేదదండోపాయాలను ఉపయోగించుకుని ఎన్డీయేలోని పక్షాలను, ఎన్డీయేతర, యూపీయేతర పక్షాలను మోడీ దారికి తెచ్చుకున్నట్టుగా కనిపిస్తున్నాడు.
మరి ఇప్పుడు కూడా ప్రతిపక్షాల నుంచి ఉమ్మడి అభ్యర్థి అనే మాట వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో యాక్టివ్ ఉన్నది మమతా బెనర్జీ మాత్రమే. సోనియాతో సమావేశమై.. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి గురించి ఆమె చర్చించారట. మరి కాంగ్రెస్ కు లోక్ సభలో కనీసం ప్రధాన ప్రతిపక్ష అర్హత కూడా లేదాయె. చాలా రాష్ట్రాల అసెంబ్లీలో కాంగ్రెస్ జీరో అయిపోయిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక తమిళనాడు వంటి రాష్ట్ర రాజకీయాన్ని బీజేపీ ఇప్పటికే గ్రిప్ లో పెట్టుకుంది. ఏ రకంగా చూసినా.. ఎక్కడా పట్టు జారకుండా గేమ్ ను నడిపిస్తోంది కమలం పార్టీ.. ఇలాంటి నేపథ్యంలో మమతా దీదీ వంటి వాళ్లు కూడా చల్లబడాల్సి ఉంటుందేమో. లేకపోతే… కోరి మోడీ చేతిలో ఓడినట్టు అవుతుంది. అణువుగాని చోట అధికులం అని.. మోడీ చేతిలో ఓడిపోయారనే పేరును తెచ్చుకోవాల్సి ఉంటుంది.

Leave a Reply