ఆ జంతువుకు అమ్మ ప్రేమ తెలుసు…

0
426

Posted [relativedate]

orangutan incredible reaction to pregnant womanప్రకృతిని ఆస్వాదించేందుకు స్థానిక జంతు ప్రదర్శనశాలకు వెళ్ళారు ఓ జంట . కలకాలం గుర్తుండిపోయే మధుర క్షణాలను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన అనుభూతి ఏమిటంటే భారీ కోతిని (ఒరంగుటన్) ముచ్చటపడి చూశారు. ఆ  ఒరంగుటన్ కూడా వీరిని చూసింది. ఒరంగుటన్ కు, గర్భిణికి మధ్యలో ఓ అద్దం ఉంది. ఆమె తన గర్భాన్ని ఒరంగుటన్ కి చూపిస్తూ ఉంటే సుతారంగా తడిమేందుకు ప్రయత్నించింది. అనేకసార్లు అద్దంపై ఆత్మీయంగా నిమిరింది . ప్రతి జీవికి తల్లి మనసు ఉంటుందని రుజువైందని ఆ దంపతులు సంతోషించారు. ఈ మధురానుభూతులను జీవితాంతం గుర్తుంచుకుంటామని చెప్తున్నారు. జంతువులు, పక్షుల పట్ల జనానికి అవగాహన కల్పించేందుకు ఇటువంటి సంఘటనలు దోహదపడతాయంటున్నారు.

[wpdevart_youtube]aM8DygXwvyc[/wpdevart_youtube]

Leave a Reply