చరణ్ కు షాక్ ఇచ్చిన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్..!

Posted November 8, 2016

ch123మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ధ్రువ సినిమాకు అనుకోని షాక్ తగిలిందని తెలుస్తుంది. ఈ సినిమా మీద ఏర్పడ్డ అంచనాలతో ఓవర్సీస్ లో కూడా భారీ మొత్తానికి బేరం తగిలిందట. ఓవర్సీస్ లో స్టార్ సినిమాలను కొనుగోలు చేసే క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ ధ్రువ నిర్మాత అల్లు అరవింద్ తో చర్చలు జరిపారట. మరి ఏమైందో ఏమో కాని ముందు రైట్స్ తీసుకునే ఊపు చేసిన వారు ఇప్పుడు సారీ అని చెప్పేశారట. ఒక్కసారిగా క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ ఇచ్చిన షాక్ కు ధ్రువ టీం ఏం చేయాలో తోచక మళ్లీ వేరే డిస్ట్రిబ్యూటర్ ను వెతుక్కునే పరిస్థితి ఏర్పడిందట .

తమిళ సూపర్ హిట్ సినిమా తని ఒరువన్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ ప్రోమోస్ కూడా సినిమా మీద అంచనాలను పెంచేస్తున్నాయి. మరి ఓవర్సీస్ లో ఈ సినిమా కష్టాలకు ముందు సినిమాల రిజల్ట్ కూడా కారణం అయ్యి ఉండొచ్చు కాని ముందు అనుకున్న కమిట్మెంట్ కు అసలు వదులుకోవడం ఏంటో అర్ధం కావట్లేదు ధ్రువ టీంకు. ఫైనల్ గా ధ్రువ ఓవర్సీస్ రైట్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి.

SHARE