Posted [relativedate]
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు 117 కోట్ల విలువైన ఆస్తులున్నాయి.తన మరణాంతరం ఆమె ఆస్తులు ఎవరికి చెందాలో ? ఆమె వీలునామా రాశారా? రాయలేదా?..అనేది అందరి మది లో మెదులుతున్న ప్రశ్న.
**తాజా సమాచారం ప్రకారం ఈ సంపద మొత్తం ఆమె ప్రాణ సఖి, క్లోజ్ ఫ్రెండ్ శశికళ నటరాజన్‌కు దక్కిందట…?
**ప్రముఖ ఇంగ్లిష్ పత్రిక ‘ది టెలిగ్రాఫ్’ కథనం.ప్రకారం జయలలిత తన ఆస్తుల గురించి రెండేళ్ల కిందటే వీలునామా రాశారట…! దాని ప్రకారం…పోయస్ గార్డెన్స్‌లోని జయ నివాసం ‘వేద నిలయం’ శశికళకు దక్కింది.
**హైదరాబాద్ నగరంలోని ఆస్తులన్నీ వివేక్ జయరామన్ చేతికి పోయాయి. ఇతను శశికళ సోదరుడు జయరామన్-ఇళవరసి దంపతుల కుమారుడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జయలలిత ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆస్తుల విలువ 113.73 కోట్లు.
**1980లో జయలలితకు వీడియో కంపెనీ యజమానిగా పరిచయమైన శశికళ వారసురాలే కాదు. రాజ్యాంగేతర శక్తిగా కూడా.
*** జయలలితకు ఇష్ట సఖి కి రెండుసార్లు విభేదాలొచ్చాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందనే ఆరోపణలపై స్నేహితురాలిని దూరంగా ఉంచింది.
అంతేకాకుండా శశికళను, ఆమె కుటుంబ సభ్యులను పార్టీ నుంచి బహిష్కరించారు కూడా. పోయస్ గార్డెన్ నుంచి శశికళను బయటకు పంపారు జయ.
***జయ ఇల్లు వేద నిలయంను ఆమె స్మారక నిలయంగా మార్చాలని ఆలోచిస్తున్నారట .