మోడీ తల్లి కూడా బ్యాంకు కి వెళ్లొచ్చారు

Posted November 15, 2016

P.M modi mother

ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ కూడా డబ్బు కోసం బ్యాంకు కు వెళ్లాల్సి వచ్చింది.
గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లోని ఓ బ్యాంకుకు ఆమె వచ్చారు. చేతిలో కర్ర, మరో చేతిలో పాత నోట్లను పట్టుకుని సాధారణ మహిళా ల లైన్ లో నిలబడి డబ్బు తీసుకున్నారు ప్రధాని తల్లే అయినా ఆమెకు కూడా బ్యాంకు ముందు నిలబడే తిప్పలు తప్పలేదు. 95 ఏళ్ల హీరాబెన్ క్యూలైన్‌లో నిలబడేసరికి కొందరు మహిళలు, కుటుంబసభ్యులు ఆమెకు సహాయం చేశారు. బ్యాంకులోపలికి తీసుకెళ్లి కొత్త నోట్లను ఇప్పించారు. ఇదిలా ఉండగా సీనియర్ సిటీజన్స్‌కు బ్యాంకులు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడంతో ఆమె నేరుగా కౌంటర్ దగ్గరకు వెళ్లి డబ్బులు మార్చుకున్నారు.

SHARE