బాల‌య్యకు త‌ల‌నొప్పిగా మారిన పీఏ!!

Posted February 5, 2017

pa sekhar became headache to balakrishna
నందమూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ … అనంత‌పురం జిల్లా హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. సినిమాలతో అనునిత్యం బిజీగా ఉండే… ఆయ‌న వీలున్నప్పుడ‌ల్లా హిందూపురం వ‌చ్చి అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లోనూ పాల్గొంటారు. అయితే ఎప్పుడూ తాను అందుబాటులో ఉండ‌డం కుద‌ర‌దు.. కాబ‌ట్టి త‌న‌కు ఏపీగా శేఖ‌ర్ అనే వ్య‌క్తిని పెట్టుకున్నారు. ఇప్పుడా శేఖ‌రుడే బాల‌య్య‌కు త‌ల‌నొప్పిగా మారాడు. నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోవాల్సిన అత‌నే… బాల‌య్య బాబుకు స‌మ‌స్య‌గా మారాడు.

ఈ మ‌ధ్య హిందూపురంలో పీఏ శేఖ‌ర్ అరాచ‌కం ఎక్కువైంద‌ని టాక్. ప్ర‌తి విష‌యంలోనూ ఆయ‌న త‌ల‌దూరుస్తున్నార‌ట‌. బాల‌య్య పేరు చెప్పి… ఇష్టానుసారం ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ట‌. ఇక టీడీపీ క్యాడ‌ర్ పైనా ఆయ‌న ప్ర‌తాపం చూపిస్తున్నార‌ట‌. మాజీ ఎమ్మెల్యేలు, సీనియ‌ర్లు ఎవ‌రినీ లెక్క‌చేయ‌కుండా… తానే ఎమ్మెల్యే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని టాక్. అంతేకాదు టీడీపీ నేత‌లంతా క‌నీస మ‌ర్యాద లేకుండా ఆయ‌న మాట్లాడ‌తార‌ట‌. మొద‌ట్లో అంత‌గా ప‌ట్టించుకోని టీడీపీ క్యాడ‌ర్ ఇప్పుడు శేఖ‌ర్ మరీ ఓవ‌రాక్ష‌న్ చేస్తుండ‌డంతో అత‌నికి వ్య‌తిరేకంగా గ‌ళ‌మెత్తింది. పీఏ శేఖ‌ర్ తీరును హిందూపురం టీడీపీ క్యాడ‌ర్ అంతా ఖండిస్తున్నారు.

పీఏ శేఖ‌ర్ వ్య‌వ‌హారం ఎలా ఉంటుందో చెప్ప‌డానికి వాట్సాప్ లో చ‌క్క‌ర్లు కొడుతున్న ఓ వీడియోనే నిద‌ర్శ‌నం. ఫోన్లో ఓ కాంట్రాక్ట‌ర్ ను బండ‌బూతులు తిడుతూ దొరికిపోయాడు శేఖ‌ర్ . ఇన్నాళ్లూ బాల‌య్య ముందు మంచివాడుగా ఫోజు కొట్టిన శేఖ‌ర్ అస‌లు రూపం ఆ ఫోన్ సంభాష‌ణ‌తో బ‌ట్ట‌బ‌య‌లైంది. అంతేకాదు ఇష్యూ ఇంత‌టితో అయిపోలేదు. శేఖ‌ర్ తీరును నిర‌సిస్తూ చిల‌మ‌త్తూరు, లేపాక్షి జ‌డ్పీటీసీ స‌భ్యులు రాజీనామా చేశారు. ఇదే క్ర‌మంలో మ‌రికొంద‌రు కూడా రాజీనామాలు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌.

వ్య‌వ‌హారం ఇంత సీరియ‌స్ గాఉంటే శేఖ‌ర్ మాత్రం ఓ రాజ‌కీయ నాయ‌కుడిలా కౌంట‌రిచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. త‌న‌కు మ‌ద్ద‌తుగా ఓ ర్యాలీని నిర్వ‌హించాల‌ని ఏర్పాట్లు చేశాడు. 10 వేల మంది వ‌స్తార‌ని అంచ‌నా వేస్తే.. వంద‌మంది కూడా రాలేద‌ట‌. దీంతో ఇప్పుడు బాల‌య్య కూడా సీన్ అంతా అర్థ‌మైంద‌ట‌. ఇక శేఖ‌ర్ ఇంటికెళ్లే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు. బాల‌య్య పీఏగా ఉండాల్సిన వ్య‌క్తి ఇలా అరాచ‌క శ‌క్తిగా మార‌తాడ‌ని ఊహించ‌లేద‌ని వాపోతున్నారు. మొత్తానికి ఇక అత‌నికి చెక్ త‌ప్ప‌ద‌ని బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతున్నారు. ఈ విష‌యంలో బాల‌య్య బాబు చాలా సీరియ‌స్ గా ఉన్నార‌ని టాక్.

SHARE