ప్యాకేజ్ క్లైమాక్స్ లోఎత్తులు పై ఎత్తులు..

  package climax chandrababu modi
ప్రత్యేక హోదా ,ప్యాకేజ్ అంశాల్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకి నేతృత్వం వహిస్తున్న మోడీ,చంద్రబాబు చివరి నిమిషం దాకా ఎత్తులు పై ఎత్తులు వేస్తూనే వున్నారు.హోదా అంశాన్ని పక్కనబెట్టి బాబు ప్యాకేజ్ కి ఒప్పుకునేలా మోడీ ఎత్తులు వేశారు.నీతి ఆయోగ్ ని ప్రయోగించి హోదా గురించి గట్టిగా అడక్కుండా బాబు కి బ్రేకులేశారు.అయితే కేవీపీ ప్రైవేట్ బిల్లు,పార్లమెంట్ లో చర్చ తరువాత వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న బాబు కేంద్రం పై ఒత్తిడి తేగలిగారు.ఏదో ఒకటి ఆంధ్రాకి చేయాల్సిన పరిస్థితి కల్పించారు.పవన్ సభతో బీజేపీ కూడా డిఫెన్స్ లో పడి ప్యాకేజ్ కి రెడీ అయ్యింది.అయితే అది ఎలా వుండాలన్నదానిపై కేంద్ర,రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఇంతాచేసి అంతర్గత చర్చల్లో ప్యాకేజ్ కి ఒప్పుకుని …ప్రకటన తరువాత బాబు రివర్స్ గేరు వేస్తే..ఇదే డౌట్ మోడీకి వచ్చిందో ..మరెవరైనా చెప్పారో గాని …ప్రకటన బాబు సమక్షంలో చేస్తామని కేంద్రం చెప్పింది ..ముందు సరేనన్న బాబు ఆ ప్యాకేజ్ కాపీ పంపిస్తే చూసి వస్తానని మెలిక పెట్టారు.కాపీ వచ్చాక బోలెడు మార్పులు ,చేర్పులు కావాలన్నారు.అవి అయితేనే ఢిల్లీ వస్తానన్నారు .ఇదంతా చూస్తుంటే జరిగే తప్పుకి పక్కవాడిని బాధ్యుడిని చేసి,మేలుకు మాత్రం తమకే క్రెడిట్ రావాలని కేంద్ర,రాష్ట్రాలు చూస్తున్నట్లుంది.మొత్తానికి మిత్రపక్షాల మధ్య వున్న ఈ వాతావరణం రాజకీయ అభద్రతా భావానికి ఓ మచ్చుతునక .ఇక శత్రు పక్షాలైతే అపనమ్మకాలు ఏ స్థాయిలో వుంటాయో వేరే చెప్పాలా?

SHARE