పాక్ వెన్నుముక ఇదే …కొట్టేస్తే పనైపోద్ది

Posted October 1, 2016

pak backbone punjabపేదరికం,ఉగ్రవాదం,వేర్పాటువాదం,సైనిక ఆధిపత్యం వంటి సమస్యలతో కునారిల్లిపోయే పాకిస్తాన్ ఏమి చూసుకుని రెచ్చిపోతోంది?సైనిక పరంగా చూస్తే అణ్వాయుధాలని ఎంతో మంది చెప్తుంటారు.కానీ సామాజికంగా,ఆర్ధికంగా ఎదిగిన ఓ రాష్ట్రం ఆదేశానికి వెన్నుముకలా నిలుస్తోంది.అదే పాకిస్తాన్ లోని పంజాబ్ .దేశ ప్రజలందరి శ్రమని దోచుకొని సంపన్న రాష్ట్రంగా ఎదిగింది పంజాబ్.రాజకీయ ప్రాబల్యం,ఆర్ధిక బలం మెండుగా ఉండడంతో ఆ రాష్ట్రం ఏమి అనుకుంటే అది జరిగే పరిస్థితి పాక్ లో వుంది.పంజాబ్ ప్రావిన్స్ లోపారిశ్రామిక,సినీ,వ్యవసాయ రంగాలుబలంగా నిలదొక్కుకున్నాయి .అక్కడ ప్రజల్లో 40 శాతానికిపైగా పట్టణాల్లోనే వుంటున్నారు.పాక్ పారిశ్రామిక ప్రగతిలో దాదాపు నాలుగోవంతు ఈ ఒక్క ప్రావిన్స్ లోనే వుంది.అన్ని వున్నా అల్లుడి నోట్లోశని అన్నట్టు పంజాబ్ ప్రావిన్స్ అంటే ఆ దేశం లోని మిగతా ప్రాంతాల్లో ద్వేషమే ఎక్కువ.

ఇక భౌగోళికంగా కూడా పంజాబ్ ప్రావిన్స్ చుట్టూ శత్రువులే .నిత్యం వేర్పాటువాదంతో రగిలే సింధు,బలూచిస్తాన్ …ఖైబర్ ఫక్తునిస్తాన్…నిత్య ఆందోళనలతో అట్టుడికే రాజధాని ఇస్లామాబాద్ ప్రాంతం..ఉగ్రవాదులతో నిండి వుండే పాక్ ఆక్రమిత కాశ్మీర్ …ఇవీ పంజాబ్ ప్రావిన్స్ చుట్టూ ఆ దేశంలోని సరిహద్దు ప్రాంతాలు.ఇక మన దేశం నుంచి చూస్తే ఆ ప్రావిన్స్ కి పంజాబ్(భారత్ ),రాజస్థాన్ ,జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో వున్నాయి.ఇలా చుట్టూ శత్రువులే మధ్య వున్న పంజాబ్ ప్రావిన్స్ కి మరో భయం భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే ?భారత్ కనుక ఆ నిర్ణయం తీసుకుంటే పంజాబ్ పని అయిపోయినట్టే .ఇలా అన్ని విధాలుగా వలకి చిక్కే అవకాశమున్న పంజాబ్ ని దెబ్బ కొడితే పాక్ వెన్నుముక విరిచినట్టే.అయితే దానిపై సైనిక బలం మాత్రమే ప్రయోగించాల్సిన అవసరం లేదు.ఎన్నో అవకాశాలు ..మరెన్నో మార్గాలు కళ్ల ముందే కనిపిస్తున్నాయి.

SHARE