పాక్ ముక్కలవ్వబోతోందా?

Posted October 1, 2016

pak divisionకాశ్మీర్ …కాశ్మీర్ అంటూ నిరంతరం అదే నామజపం చేస్తున్న పాకిస్తాన్ చాప కింద నీళ్లు వస్తున్నాయి.తడి తగులుతున్నా పూర్తిగా మునగలేదన్న భ్రమల్లో బతికేస్తోంది పాపం పాక్.ఉగ్రదానికే పాక్ పుట్టినిల్లని ప్రపంచమంతా భావిస్తోంది.అయితే అంతకు మించి…అంతకు మించి ..వేళ్లూనుకుంటోంది వేర్పాటువాదం.పాక్ చెర నుంచి మమ్మల్ని బయటపడెయ్యండి అంటూ వివిధ ప్రాంతాల ప్రజలు భారత్ సహా ప్రపంచదేశాల వైపు ఆశగా చూస్తున్నారు. పాక్ నుంచి విడిపోవాలని పోరాడుతున్న వాళ్ళ ప్రయత్నాలు సఫలమయ్యే సూచనలు మెండుగానే కనిపిస్తున్నాయి.అదే జరిగితే పాక్ ముక్కలవ్వడం ఖాయం.

1 .పాక్ ఆక్రమిత కాశ్మీర్,సింధ్ రాష్ట్రాలు అఖండ భారత్ లో కలవాలని ఆశగా ఎదురుచూస్తున్నాయి.1947 లో దేశ విభజనకి గట్టిగా పట్టింది ఈ సింధ్ ప్రజలే .అలాంటిది వాళ్లే ఇప్పుడు భారత్ లోకలవాలని తహతహలాడుతున్నారు.
2.బలూచిస్తాన్.ఇరాన్ లోని కొంత ప్రాంతం కలిసి కొత్త దేశంగా అవతరించాలని ఎన్నో పోరాటాలు సాగుతున్నాయి.
3.ఇక పాక్ లోని పక్తునిస్తాన్ ప్రజలు ఎప్పుడెప్పుడు ఆఫ్గనిస్తాన్ జెండా కిందకు వెళదామా అని ఎదురుచూస్తున్నారు.
వీళ్లంతా భారత్ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.ఆ ప్రజల పోరాటానికి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్ష మద్దతిస్తే చాలు పాక్ ముక్కలవ్వడం ఖాయం.

SHARE