కపోత యుద్ధం చేస్తున్న పాక్..

 

pak pigeon battleసర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ప్రధాని మోడీ పేరు వింటేనే పాక్ అగ్గి మీద గుగ్గిలమవుతోంది.ఏమి చేయలేని పరిస్థితుల్లో కపోత యుద్ధం చేస్తోంది.కపోత యుద్ధం అంటే మరేంటో కాదు పావురాలతో హెచ్చరికలు పంపిస్తోంది.తాజాగా బమియల్ సెక్టార్ లోని సింబాల్ పోస్టు వద్ద ఇలా సందేశంతో వస్తున్న ఓ పావురాన్ని BSF జవాన్లు పట్టుకున్నారు.పాక్ భూభాగం నుంచి అది వచ్చినట్టు తెలుస్తోంది.ఆ పావురం తెస్తున్న చిన్న కాగితం మీద ఇలా రాసి ఉంది..’ మోడీజీ మమ్మల్ని 1971 (ఇండో పాక్)యుద్ధం నాటి ప్రజల్లాగా చూడొద్దు.ఇపుడు ప్రతి చిన్నారి భారత్ కి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా వున్నారు.

ఈ తరహాలో లేఖలు రాస్తూ పావురాలు వదలడం పాక్ అనుకూలురకి పరిపాటిగా మారింది.ఇదే విధంగా రాసిన లేఖతో ఓ పావురం 10 రోజుల కిందట పంజాబ్ లోని హోషియార్పూర్ దగ్గర దొరికింది.రెండు రోజుల కిందట ఇలాంటి చెత్త హెచ్చరికలు ఉన్న బెలూన్ లు రెండు పోలీసుల కళ్లబడ్డాయి.అసలు యుద్ధం మాటేమో గానీ కపోత యుద్ధంతో పాక్ కుతి తీర్చుకుంటోంది.

SHARE