Saturday, September 25, 2021
Homelatestపాక్ తోక వంకరే..!

పాక్ తోక వంకరే..!

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సరిహద్దుల్లో మనకుగోతులు తవ్వాలని ప్రయత్నిస్తున్న పాకిస్థాన్.. మరోసారి తన కుక్కతోక బుద్ధిని బయటపెట్టింది. భారత్ ఆర్మీని ఏం చేయలేక, ఉగ్రవాద మూకల్ని ఎగదోసే ప్రయత్నాలు విఫలం కావడంతో.. పాక్ ఆర్మీ నకిలీ టెక్నిక్ ఎంచుకుంది. భారత్ బంకర్లను పేల్చేస్తున్నట్లు ఓ ఫేక్ వీడియో తయారుచేసి వదిలింది. దీనిపై భారత్ ఇప్పటివరకూ స్పందించకపోయినా.. ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

27 సెక్షన్ల పాటు ఉన్న వీడియోను పాక్ ఆర్మీ అధికారిక ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ ఘఫూర్ తన ట్విట్టర్ అకౌంట్లో పెట్టారు. ఇండియన్ ఆర్మీ స్థావరాలపై దాడికి దిగామని చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆయన చెప్పుకున్నారు. కానీ ఈ వీడియో కూడా నకిలీదే అయ్యుంటుందనే వాదన వినిపిస్తోంది. గతంలో ఓసారి ఇలాంటి వీడియోనే పాక్ రిలీజ్ చేస్తే.. అది ఫేక్ అని తేల్చేసింది ఇండియన్ ఆర్మీ. కాన ఈసారి మాత్రం ఇండియన్ ఆర్మీ ఎందుకు సైలంట్ గా ఉందనే చర్చ నడుస్తోంది.

పాక్ లాంటి దేశం చేసే ప్రతి పిచ్చిపనికీ స్పందించాల్సిన అవసరం లేదన్నది భారత్ ఆర్మీ వర్గాల మాట. ప్రతిసారీ మనం రియాక్టైతే పాక్ స్థాయి పెంచినట్లు అవుతుందని, వాళ్లు చేసే దానికి ఇదే సరైన జవాబు అవుతుందని అంటున్నారు. మరోవైపు భారత్ ఆర్మీ చీఫ్ కామెంట్స్ కూడా అగ్రెస్సివ్ గానే ఉంటున్నాయి. అవసరమైతే భారత నారీమణుల్ని యుద్ధభూమికి పంపుతామన్న ఆయన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఆర్మీలో మహిళలున్నా వారిని ఎప్పుడూ యుద్ధం కోసం ఉపయోగించలేదు. మరి ఆ పని చేస్తారా.. లేదా అనేది భవిష్యత్తులో తేలనుంది.

- Advertisment -
spot_img

Most Popular