వంకర కూతలు కూస్తున్న పాక్

0
663

 pakistan pm nawaz sharif pakistan pm nawaz sharif unparliamentary words about kashmir about kashmir

కాశ్మీర్ పై మరోసారి వాయిస్ పెంచారు పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్. కాశ్మీర్ ప్రజల ఫ్రీడమ్ ఫైట్ కు తమ మద్దతు ఉంటుందన్నారు. అటు పాక్ లో జరగనున్న సార్క్ దేశాల ఆర్థికమంత్రుల సమావేశానికి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ డుమ్మాకొట్టే అవకాశముంది. మరోవైపు… కాశ్మీర్ లో పరిస్థితి ఇంకా రగులుతూనే ఉంది. నిన్నటి కాల్పుల్లో నలుగురు చనిపోయారు.కాశ్మీరీ ప్రజల దుస్థితిని ప్రపంచం పట్టించుకోవాల్సిన అవసరముందన్నారు పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్.

కాశ్మీరీ స్వాతంత్య్రోద్యమానికి తమ దేశం నైతిక, దౌత్య, రాజకీయ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. అమాయక కాశ్మీరీలపై జరుగుతున్న అరాచకాలను ప్రపంచం సమీక్షించాల్సిన అవసరముందన్నారు. స్వాతంత్రం కోసం కాశ్మీరీలు భారీ త్యాగాలు చేస్తున్నారన్నారు షరీఫ్. త్వరలో పదవీ కాలం ముగియనున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ అధ్యక్షుడు సర్దార్ ముహమ్మద్ యాకూబ్ ఖాన్ తనను కలసిన సందర్భంగా నవాజ్ ఈ కామెంట్స్ చేశారు.

బలూచిస్తాన్ అంశంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో అమెరికా, యూరప్ లు గొంతు కలపాలని బలూచ్ ఉద్యమనేతలు కోరారు. ఆ ప్రాంతంలో పాక్ అరాచకాలకు వ్యతిరేకంగా తమకు మద్దతు ఇవ్వాలని అమెరికా, యూరప్ లను కోరారు. పాక్ తో సంబంధాలు రోజురోజుకు దిగజారుతున్న పరిస్థితుల్లో రక్షణమంత్రి మనోహర్ పారికర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.  పాకిస్థాన్ వెళ్లటమంటే నరకంలోకి వెళ్లటం లాంటిదేనన్నారు. బలూచిస్తాన్ లో మానవ హక్కుల ఉల్లంఘనను పాక్ ఆపివేయాలన్నారు.ఈ నెల 25, 26న పాక్ రాజధాని ఇస్లామాబాద్ లో జరిగే సార్క్ దేశాల ఆర్థికమంత్రుల సమావేశానికి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ హాజరుకాకపోవచ్చునని అధికార వర్గాలు చెబుతున్నాయి.

రాజకీయ కారణాల వల్లే ఆయన ఈ సమావేశానికి దూరమయ్యే చాన్సుందని తెలిపాయి.మరోవైపు కాశ్మీర్ లో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది.  నిన్నటి అల్లర్లలో నలుగురు చనిపోయారు. నెలరోజుల పైగా రగులుతున్న హింసలో చనిపోయినవారి సంఖ్య 62కు చేరింది. బుద్గాం జిల్లా మాగంలో ఆందోళనకారులు సీఆర్ పీఎఫ్ క్యాన్వాయ్ పై రాళ్లు విసరడంతో భద్రతాదళాలు కాల్పులు జరిపాయి. దీంతో ముగ్గురు చనిపోయారు. అనంత్ నాగ్ జిల్లాలో జరిగిన కాల్పుల్లో ఒక యువకుడు చనిపోయాడు.  కాశ్మీర్ లో తాజా హింసపై హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సమీక్షించారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, హోం శాఖ ఉన్నతాధికారులు కశ్మీర్ లో పరిస్థితిని రాజ్ నాథ్ కు వివరించారు. లోయలో శాంతి పునరుద్ధరణకు కృషిచేయాలని రాజ్ నాథ్ ఆదేశించారు.

Leave a Reply