యు.ఎస్ కాకపోతే రష్యా,చైనా…పాక్ అత్యాశ

Posted October 7, 2016

 pakistan politician leader mushahid hussain angry america
చుట్టూ ఉన్న దారులన్నీ మూసుకుపోతున్నప్పుడు…అయిన వాళ్లే చేసింది తప్పు అని ఎత్తి చూపినప్పుడు…వివేకం వున్నవాడు ఆత్మశోధన చేసుకుంటాడు…విచక్షణ కోల్పోయినవాడు ఉన్మాదిగా మారతాడు.ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి రెండో విధంగానే వుంది.ఓ వైపు యూరీ దాడితో సంబంధం లేదని..మరో వైపు కాశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని నమ్మించడానికి ఆ దేశం నానా పాట్లుపడుతోంది.అయినా ఆ మాటలెవ్వరు నమ్మడం లేదు…అగ్రరాజ్యం అమెరికా సహా.అమెరికాని నమ్మించడానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తరపున ఇద్దరు రాయబారులు ముషాహిద్ హుస్సేన్ ,షాజ్రా మన్సద్ ప్రయత్నించి భంగపడ్డారు.అమెరికా మేధోసంస్థ అట్లాంటిక్ కౌన్సిల్ లోవీరి వాదనను యు.ఎస్ లెక్క చేయలేదు.

దీంతో రెచ్చిపోయిన ముషాహిద్ హుస్సేన్ ఏకంగా అమెరికా మీదే మాటల యుద్ధం మొదలెట్టాడు.కాశ్మీర్ అంశంలో అమెరికా జోక్యాన్ని ఒప్పుకోబోమని.. అయినా ఆ దేశ ఆధిపత్యం ఇకపై కొనసాగబోదని చెప్పారు.అంతటితో ఆగకుండా కాశ్మీర్ విషయంలో మా వాదనను అమెరికా పట్టించుకోకుంటే రష్యా,చైనా లతో చేతులు కలుపుతామని హుస్సేన్ దుందుడుకు వ్యాఖ్యలు చేశారు.అంటే రష్యా,చైనా ల మద్దతు కూడగట్టి అమెరికాని కూడా భయపెట్టాలనుకుంటోంది పాపం పిచ్చి పాక్..అయినా పాక్ అడగ్గానే రష్యా,చైనాపరిగెత్తుకు వస్తాయా? పిచ్చి ఆలోచనలు..వెర్రి భ్రమలు ….ఏమి చేస్తాం కొండని ఢీకొంటే తల మిగులుతుందని తెలియని మూర్ఖుల ముందు ఏమి మాట్లాడతాం.

SHARE