హిందువులను కరుణించిన పాక్!!

0
212
pakistan releaves hindus

Posted [relativedate]

pakistan releaves hindus
పాకిస్తాన్ లో మైనార్టీలుగా ఉన్న హిందువుల పరిస్థితి ఏమీ బాగాలేదు. దశాబ్దాలుగా వారిని పట్టించుకునేవారే కరువయ్యారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో వారికి ప్రాధాన్యం ఉండదు. అక్కడి రాజకీయ నాయకులకూ వీరంటే అలుసే. పక్క దేశాలకు నీతులు చెప్పడమే తప్ప ఎప్పుడూ హిందువుల గోడును విన్న దాఖలాలే లేవు. అలాంటి పాకిస్తాన్ ఎట్టకేలకు హిందువులకు పెద్ద శుభవార్త వచ్చింది. అదీ కూడా న్యూ ఇయర్ గిఫ్ట్ గా.

పాక్ లోని హిందువులు ఎప్పటి నుంచో హిందూ వివాహాల చట్టం కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు దాని మోక్షం లభించింది. ఈ చట్టానికి సంబంధించిన బిల్లును మానవ హక్కుల వ్యవహారాలు చూసుకునే సెనేట్ క్రియాశీల కమిటీ ఏకగ్రీంగా ఆమోదించింది. హిందూ వివాహాల బిల్లు-2016కు సెప్టెంబర్ నెలలో జాతీయ అసెంబ్లీ ఆమోదించింది. అనంతరం, దీనిని సెనేట్ కమిటీకి పంపించగా అది తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ బిల్లు చట్టంగా రూపొందితే ప్రతి హిందువు వివాహాన్ని నమోదు చేసుకునే వీలుంటుంది. అలాగే హిందువులు తమ వివాహ సమస్యలపైనా.. విడాకుల సమయంలో కోర్టులకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇది పాకిస్థాన్లోని హిందువులకు నూతన సంవత్సరంలో కొత్త బహుమతినని చెప్పక తప్పదు. ఆలస్యంగానైనా తమగోడును విన్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పాక్ లోని హిందువులు.

Leave a Reply