బుద్ధి లేని పాక్ ఇంకా తలెగరేస్తోంది …

0
460

Posted [relativedate]

pak
ఊహించని రీతిలో పాకిస్థాన్ పై తొలిసారి సర్జికల్‌ స్ర్టైక్‌తో గట్టి సమాధానం ఇవ్వడంతో  ఆ దేశం భారత్‌పై నిత్యం అక్కసు వెళ్లగక్కతూనే ఉంది. 100 సార్లకుపైగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. వందల్లో మన సైనికులను పొట్టనపెట్టుకుంది.. మరోవైపు ఆ దేశ రాజకీయ పక్షాలు ప్రభుత్వం సరిగాస్పందించడం లేదంటూ ఒత్తిడి పెంచడంతో పరువుకోసం పాకులాడుతుంది. ఈక్రమంలో చేపట్టిన ప్రతి చర్యకు భారత్‌సేనల నుంచి ధీటైన సమాధానం రావడంతో ఏం చేయలేని స్థితిలో ఘీంకారాలు చేస్తుంది. దౌత్యపరంగానూ అన్నింటా అవమానమే ఎదుర్కొవడంతో యుద్ధానికి కాలుదువ్వుతుంది. తాజాగా శత్రువుకు గట్టి సమాధానం చెప్పితీరుతామని పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ భారత్‌కు పరోక్ష హెచ్చరికలు చేశారు. దానితోపాటు భారత సరిహద్దుకు అత్యంత సమీపంలోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో ఉన్న బహవాల్‌పూర్‌లో బుధవారం పాక్‌ సైన్యం మెరుపు కవాతు నిర్వహించింది.

ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధమేనని ప్రకటించేందుకే పాక్‌ సైన్యం ఈ కవాతు నిర్వహించడం గమనార్హం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని షరీఫ్‌ హాజరయ్యారు. అదేవిధంగా ఆర్మీ చీఫ్‌ జనరల్‌ రహీల్‌ షరీఫ్‌, స్టాఫ్‌ కమిటీ ప్రధానాధికారులు, త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. ఈ కవాతులో జేఎఫ్‌-17 థండర్‌ ఫైటర్‌ జెట్స్‌, హెలికాప్టర్‌ గన్‌ షిప్స్‌, లక్ష్యాలను అత్యంత సునాయాసంగా ఛేదించగల అల్‌-ఖలిద్‌ టాంకులను ప్రదర్శించారు. కాగా, నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం ఏడుగురు పాక్‌ సైనికులను కాల్చి చంపిన నేపథ్యంలో కవాతుకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే సరిహద్దులో యుద్దమేఘాలు కమ్ముకున్నట్లు కనిపిస్తుంది.

Leave a Reply