తీర్పు చెప్పారని రేప్‌..!

0
443

Posted [relativedate]
+ అవమానభారంతో ఆత్మహత్య
+ పాక్‌లో జరిగిన ఘాతుకం

Pakistan: Woman raped in revenge on panchayat order; commits suicide
పాకిస్థాన్‌ అనగానే చాలా మందికి వ్యతిరేక భావం కలుగుతూ ఉంటుంది.. అక్కడి ప్రభుత్వాలు అక్కడి వ్యక్తుల తీరు అలా ఉండటమే కారణమనిపిస్తుంది…. తాజాగా జరిగిన ఒక సంఘటనలో అది ఆటవిక సమాజమని తేలింది. ఒక తప్పు జరిగిందని మరో తప్పు చేయాలని తీర్పు చెప్పి.. ఇద్దరు ఆడవాళ్ల జీవితాల తో ఆడుకున్నారు. ఓ వ్యక్తి బాలికపై అత్యాచార యత్నం చేశాడని.. అతడి కూతురికి శిక్ష వేశారు! వివాహిత అని కూడా చూడకుండా, ఆమెపై అత్యాచారం చేసి ప్రతీకారం తీర్చుకోవాలంటూ పంచాయతీ పెద్దలు ఆటవిక తీర్పు చెప్పారు! ఆ తీర్పునకు బలైపోయి, గర్భం కూడా దాల్చడంతో అవమానభారాన్ని భరించలేని ఆ యువతి చివరికి ఆత్మహత్యకు పాల్పడింది! పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రం, గుజ్‌రాత్‌ జిల్లాలో ఈ దారుణం జరిగింది. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఐదు నెలల క్రితం ఓ బాలికపై అత్యాచార యత్నం చేశాడని పంచాయతీ పెట్టారు. అతడి 20 ఏళ్ల కూతురిపై బాలిక తండ్రి అత్యాచారం చేసి ప్రతీకారం తీర్చుకోవాలని తీర్పు చెప్పారు. దీంతో బాలిక తండ్రి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, రెండేళ్ల క్రితం విదేశాలకు వెళ్లిన భర్త త్వరలో తిరిగి రానుండగా, అతడికి ముఖం ఎలా చూపించాలని మధనపడిన ఆమె రెండు వారాల క్రితం అత్తారింట్లో పెట్రోల్‌ పోసుకుని నిప్పు అంటించుకుంది. లాహోర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. కాగా, ఈ సంఘటనకు సంబంధించి 10 మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. తాను బాలికపై అత్యాచార యత్నం చేయలేదని, అన్యాయంగా తన కూతురిపై ప్రతీకారం తీర్చుకున్నారని బాధితురాలి తండ్రి వాపోయాడు.

Leave a Reply