శశికళ శకం ముగిసినట్లేనా..?

0
278
palani swamy don't listen the sasikala words

Posted [relativedate]

palani swamy don't listen the sasikala wordsతమిళ రాజకీయాల్లో శశికళ శకం ముగియనుందా అంటే అవుననే అంటన్నాయి  అన్నాడీఎంకే వ‌ర్గాలు.

అమ్మ మరణించిన తర్వాత తానే సీఎం అవుదామని ఆశపడ్డ  శశికళకు ఊహించని షాక్ తగిలింది.  ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో  ప్రస్తుతం జైల్లో కటకటాలు లెక్కపెడుతోంది.  అయితే అమ్మ జయలలిత లానే తాను కూడా కటకటాల వెనక ఉండే తమిళరాజకీయాలను మందుకు నడిపేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈ ప్లాన్ కూడా బెడిసి కొట్టిందని  సమాచారం.

అమ్మకు కష్టం వచ్చినప్పుడల్లా  ఆమె నమ్మినబంటు పన్నీర్ సెల్వం సీఎం పీఠమెక్కి ఆమెను ఆదుకున్నాడు. అమ్మ జైల్లో ఉన్నా ఆమె ఆదేశాల మేరకే పాలన సాగించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే అమ్మ ఆజ్ఞ… పన్నీర్ పాలన అన్న విధంగా నడిచింది. అమ్మ రూట్లోనే నడుస్తున్న చిన్నమ్మ శశికళ కూడా తనకు నమ్మినబంటైన పళనిస్వామినే సీఎం చేసింది. అయితే అమ్మ ఆజ్ఞని శిరసావహించిన పన్నీర్ లా…  పళని… చిన్నమ్మ ఆదేశాలను వినకుండా పెడచెవిన పెడుతున్నాడట. అసలు చిన్నమ్మను కలిసేందుకు కూడా  పళని నిరాకరిస్తున్నాడట. ఏమాత్రం రాజకీయ అనుభవం లేని చిన్నమ్మ తనకు దిశానిర్దేశం చేయడమేమిటని భావిస్తున్నాడట పళని.  మే 14న జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ప్రజల మనసులను గెలుచుకునే దిశగా పళని అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో కూడా  పళని పాచికలు పారితే త్వరలోనే చిన్నమ్మ శకం ముగుస్తుందని  రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply