గురువును మించిన శిష్యుడు!!!

0
278
palanisamy beat out shengottayan

Posted [relativedate]

palanisamy beat out shengottayan
వీర విధేయ‌తే ప‌ళ‌నిస్వామికి వ‌ర‌మైందా? చిన్న‌మ్మ‌నే న‌మ్ముకోవ‌డం క‌లిసొచ్చిందా? అంటే ఔన‌నే అంటున్నారు సీఎం ప‌ళ‌నిస్వామివ‌ర్గం నాయ‌కులు. నిజానికి సీఎం రేసులో మొద‌టినుంచి సెంగొట్ట‌య‌న్ పేరు వినిపించింది. ఎందుకంటే ఆయ‌నే అన్నాడీఎంకేలో సీనియ‌ర్ నాయ‌కుడు. పైగా 8 సార్లు ఎమ్మెల్యేగా ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. సెంగొట్ట‌య‌న్ తో పోల్చుకుంటే…. ప‌ళ‌నిస్వామి 4 సార్లు మాత్ర‌మే ఎమ్మెల్యే అయ్యారు. పైగా ప‌ళ‌నిస్వామికి రాజ‌కీయ గురువు సెంగొట్ట‌య‌న్ కావ‌డం విశేషం.

ప‌ళ‌నిస్వామిని రాజ‌కీయాల్లోకి తెచ్చిందే సెంగొట్ట‌య‌న్. ఆయ‌న అండ‌తో పాలిటిక్స్ లోకి అడుగుపెట్టి మెల్ల‌గా అమ్మ వ‌ర్గానికి ద‌గ్గ‌ర‌య్యారు. అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత చిన్న‌మ్మకు అండ‌గా నిలిచారు. ముఖ్యంగా క్యాంపు విష‌యంలో ఎమ్మెల్యేల‌పై ప‌ట్టు సాధించ‌డంలో ప‌ళనిస్వామే కీల‌క‌పాత్ర పోషించారు. ఏం జ‌రిగినా తాను మాత్రం చిన్న‌మ్మ వెంటే ఉంటాన‌ని ఆమెతో చెప్పార‌ట‌. ఒకానొక స‌మ‌యంలో క్యాంపులోని ఎమ్మెల్యేలంతా జంప్ అయిపోతార‌ని ప్ర‌చారం జ‌రిగినా… వారిని నిలువ‌రించింది కూడా ప‌ళ‌నేన‌ని టాక్. అదే స‌మ‌యంలో సెంగొట్ట‌య‌న్ కూడా చిన్న‌మ్మ వ‌ర్గంలో ఉన్నా… ప‌ళనిస్వామిలా దూకుడు చూపెట్ట‌లేక‌పోయారు. తాను సీనియ‌ర్ అన్న భ్ర‌మ‌లో…త‌న‌కే అవకాశం వ‌స్తుంద‌ని ఆశ పెట్టుకున్నారు. కానీ ఆదిశ‌గా చిన్న‌మ్మ ద‌గ్గ‌ర మార్కులు సాధించ‌లేక‌పోయారు. అదే సెంగొట్ట‌య‌న్ కు శాప‌మైంది.

జైలుకెళ్ల‌బోతున్న త‌రుణంలో విధేయ‌త ఉన్న నాయ‌కుడే త‌న‌కు అవ‌స‌రం కాబ‌ట్టి…. ప‌ళ‌నిస్వామికే అవ‌కాశం ఇచ్చింది చిన్న‌మ్మ‌. 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సెంగొట్ట‌య‌న్ కంటే… 4 సార్లు మాత్ర‌మే ఎమ్మెల్యేగా గెలిచిన ప‌ళ‌నిస్వామికి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. దీంతో ఏ సెంగొట్ట‌య‌న్ కింద తాను ప‌నిచేశారో… అదే సెంగొట్ట‌య‌న్ ను త‌న మంత్రివ‌ర్గంలో ఛాన్సిచ్చారు ప‌ళ‌నిస్వామి. గురువును మించిన శిష్యుడు అనిపించుకున్నారు. రాజ‌కీయాల్లో సీనియ‌ర్ – జూనియ‌ర్ అన్న‌ది ఉండ‌దు.. ఎప్పుడు ఏమైనా జ‌ర‌గొచ్చు అన‌డానికి ప‌ళ‌నిస్వామి ఉదంత‌మే బెస్ట్ ఎగ్జాంపుల్!!!

Leave a Reply