ప‌ళ‌ని గెలుపు తాత్కాలిక‌మేనా?

0
241
palanisamy winning is for short period

Posted [relativedate]

palanisamy winning is for short period
త‌మిళ‌నాడు అసెంబ్లీ బ‌ల‌ప‌రీక్ష‌లో విజ‌య‌దుందుభి మోగించిన ప‌ళ‌నిస్వామి గెలుపు తాత్కాలిక‌మేనా? ఎమ్మెల్యేల‌ను త‌న వైపు తిప్పుకోలేక‌పోయిన సెల్వం మ‌ళ్లీ విజృంభిస్తారా? 1988 లో జ‌య‌లాగే… సెల్వం కూడా స‌త్తా చాటుతారా? అంటే ఔన‌నే అంటోంది సెల్వం వ‌ర్గం.

1988లో నాటి అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష జ‌రిగింది. జానకీ రామచంద్ర‌న్ ఈ ప‌రీక్ష‌లో పాస‌య్యారు. జాన‌కి త‌ర‌పున 99 మంది ఎమ్మెల్యేలుంటే… .. 35 మంది జయలలిత వైపు ఉన్నారు. కానీ జాన‌కి గెలుపు తాత్కాలిక‌మే అయ్యింది. జ‌య ఒక్క‌సారిగా విజృంభించారు. పార్టీ క్యాడ‌ర్ ను త‌న వైపు తిప్పుకోవ‌డం విజ‌యం సాధించారు. సీఎంగా ఉన్నా జాన‌కీ రామ‌చంద్ర‌న్ మాత్రం పార్టీ క్యాడ‌ర్ ను కాపాడుకోలేక‌పోయారు. జ‌య‌ల‌లిత దెబ్బ‌కు జాన‌కీ రామ‌చంద్ర‌న్ రాజ‌కీయ జీవిత‌మే ముగిసిపోయింది.

అప్ప‌ట్లో జ‌రిగిన ప‌రిణామాల్లాగే… ఇప్పుడు కూడా ప‌ళ‌నిస్వామి గెలుపు తాత్కాలిక‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది. ఎందుకంటే అసెంబ్లీలో ఆయ‌న ర‌హ‌స్య ఓటింగ్ కు సిద్ధ‌ప‌డలేదు. ర‌హ‌స్య ఓటింగ్ జ‌రిగితే త‌న‌కు ఓట‌మి త‌ప్ప‌ద‌ని ఆయన భ‌య‌ప‌డ్డారు. దీంతో ఎలాగోలా గెలిచి మ‌మ అనిపించారు. అయితే ఎమ్మెల్యేలు ఇప్పుడెలాగూ ప‌ళ‌ని వెంట నిలిచారు..కానీ భ‌విష్యత్తులో ఆయ‌న వెంటే ఉంటార‌ని చెప్ప‌లేం. ఎందుకంటే ప‌న్నీర్ సెల్వం అంత ఈజీగా తీసేయ ద‌గ్గ వ్య‌క్తి ఏం కాదు. మాజీ సీఎం. అందులోనూ ఆయ‌న ఇప్పుడు జ‌నంలోకి వెళ్తానని చెబుతున్నారు. ఒక‌వేళ జ‌నంలోకి వెళ్తే వాతావ‌ర‌ణం ఆయ‌న‌కే అనుకూలించే అవ‌కాశ‌ముంది. అదే జ‌రిగితే ప‌ళ‌ని వైపు ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కొక్క‌రుగా జారుకునే అవ‌కాశ‌ముంది. ప్ర‌భుత్వమే ప‌డిపోయే అవ‌కాశాలు కూడా లేక‌పోలేదు.

ఒక‌వేళ మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లంటూ వ‌స్తే ప‌ళ‌నిస్వామి జ‌నామోదం పొందడం క‌ష్ట‌మే. ఎందుకంటే ఆయ‌న వెన‌క చిన్న‌మ్మ ఉన్నా… ఆమె ప్ర‌స్తుతం జైల్లో ఉన్నారు. అక్క‌డి వ్యూహం ప్ర‌కార‌మే న‌డుచుకోవాల్సిన ప‌రిస్థితి ఆయ‌న‌ది. కానీ సెల్వం ప‌రిస్థితి అలా కాదు. మాజీ సీఎం అన్న సానుభూతి ప్ర‌జ‌ల్లో ఉంది. ఆయ‌న‌తో పొత్తుకు ఇత‌ర పార్టీలుకూడా ముందుకొచ్చే అవ‌కాశ‌ముంది. అదేజ‌రిగితే అప్ప‌ట్లో జ‌య‌లా… ప‌న్నీర్ సెల్వం స‌త్తా చాట‌డం పెద్ద క‌ష్టం కాదు!!!

Leave a Reply