అంతా చిన్నమ్మ ప్లాన్ ప్రకారమే ..

0
234
palaniswamy bumper offer to tamil nadu peoples this is sasikala plan

Posted [relativedate]

palaniswamy bumper offer to tamil nadu peoples this is sasikala plan
బెంగళూరు ,పరప్పణ అగ్రహారం జైలు నుంచి బయటపడేందుకు వేసిన ప్లాన్ అమలుపరిచే పనిలో పడింది చిన్నమ్మ అండ్ కో.బెంగళూరు నుంచి చెన్నై వచ్చి పడేందుకు చిన్నమ్మ వేసిన ప్లాన్ ప్రకారమే ఇప్పటిదాకా నడిచింది.తాజాగా శశికళ స్వయంగా తాను శిక్ష అనుభవిస్తున్న పరప్పణ జైలు అధికారులకి ఓ లేఖ రాసింది.ఆ లేఖ లో తనకు ఈ జైలులో ప్రాణ భయం ఉన్నందున వేరే జైలుకి తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరింది.మరోవైపు ఆమె తరపున ఇదే వాదనతో సుప్రీమ్ కోర్ట్ లో పిటీషన్ వేసేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.ఆ వ్యవహారాల్ని శశికళ భర్త నటరాజన్ దగ్గరుండి చూసుకుంటున్నారు.

నిజంగా శశికళ అనుకున్నట్టు జరిగితే తమిళనాడు పరిపాలన అంతా చెన్నై జైల్లో మకాం వేసే చిన్నమ్మ చెప్పినట్టే సాగిపోతుంది.కొత్త ముఖ్యమంత్రి పళనిస్వామి ఈ విషయాల్ని గమనించే అడుగులు వేస్తున్నారు.శశికళ చెన్నై రాకముందే ఆమె ప్లాన్ ప్రకారం సర్కార్ కి కొత్త ఇమేజ్ తెచ్చుకునేందుకు కీలక నిర్ణయాలు ప్రకటించారు.

1 . నిరుద్యోగ భృతి రెట్టింపు చేయడం
2 . గర్భిణీ స్త్రీలకి అందించే సాయం 12 నుంచి 18 వేలకి పెంపు
3 . ఉద్యోగాలు చేసే మహిళలకి లక్షమందికి 50 శాతం సబ్సిడీ పై ద్విచక్ర వాహన కొనుగోలు అవకాశం
4 . 85 కోట్ల రూపాయలతో మత్స్యకారులకు 5 వేల గృహాల నిర్మాణం
5 .మరో 500 ప్రభుత్వ మద్యం దుకాణాల మూసివేత.

పళనిస్వామి తక్షణం ఈ ఫైల్స్ మీద సంతకాలు పెట్టడం వెనుక కూడా చిన్నమ్మ ప్లాన్ ఉన్నట్టు తెలుస్తోంది.ఎమ్మెల్యేల సంగతి ఎలా వున్నా ప్రజాక్షేత్రంలో కొత్త ప్రభుత్వం,తన మీద సానుకూలత లేదని శశికళకి ఇంటలిజెన్స్ నివేదిక ద్వారా తెలుసుకున్న ఆమె జనాభిప్రాయాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు ఈ అస్త్రాలు ప్రయోగించినట్టు తెలుస్తోంది.ఏదేమైనా కేంద్ర మద్దతు లేకపోయినా ఇప్పటికీ అంతా చిన్నమ్మ చెప్పినట్టే ,ఆమె ప్లాన్ ప్రకారమే అడుగులు పడుతున్నాయి.

Leave a Reply