పళనికి ముహూర్తం ఖరారు..పన్నీర్,జగన్ కి షాకు

Posted [relativedate]

palaniswamy chief minister of tamilnadu panneerselvam and jagan shocked
తమిళనాడులో రెండు వారాల రాజకీయ అనిశ్చితికి తెర పడింది.పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్టు శశికళ,పన్నీర్ సెల్వం తెగ పోరాడితే చివరికి సీఎం సీట్ పళనిస్వామికి దక్కింది.దేవర్ కులానికి చెందిన ఇద్దరు పోటీపడితే కుర్చీ మాత్రం గౌండర్ కులానికి చెందిన నేతని వలచింది.దేవర్ కులానికి చెందిన ఎమ్మెల్యేలు అన్నాడీఎంకేలో 38 మంది ఉన్నప్పటికీ పదవి మాత్రం ఆ వర్గానికి దక్కకుండా పోయింది.ఇలా అన్ని విధాలుగా కలిసొచ్చిన అదృష్టంతో ఈ సాయంత్రం 4 గంటలకు పళనిస్వామి తమిళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది.

ఈ పరిణామం కేంద్రాన్ని నమ్ముకున్న పన్నీర్ సెల్వానికి పెద్ద షాక్.వ్యక్తిగతంగానూ పన్నీర్,పళని స్వామి మధ్య వైరం వుంది.ఇప్పుడు పన్నీర్ కి ఇబ్బందులు తప్పవు.కేంద్రం మీద ఆధారపడటం తప్ప ఆ కేంద్రం ఇచ్చిన విలువైన గడువుని వాడుకోవడంలో పన్నీర్ విఫలమయ్యాడు.దీంతో అనూహ్యంగా ఏదైనా జరిగితే తప్ప పన్నీర్ రాజకీయ భవిష్యత్ మీద నీలినీడలు కమ్ముకున్నట్టే.

ఇక ఎక్కడో ఉన్న పళని స్వామి ఎవరూ ఊహించని విధంగా వైసీపీ అధినేత జగన్ ని కూడా ఇబ్బంది పెట్టారు.గుంటూరు సమీపంలోని నల్లపాడు వద్ద జగన్ యువభేరి పేరిట ఈరోజు యువకులతో సమావేశమయ్యారు.ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఎందుకు అవసరమో ఆయన యువతకు అవగాహన కల్పించాలనుకున్నారు.మాములుగా అయితే తెలుగు న్యూస్ చానెల్స్ అన్నీ ఆ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేసేవి.కానీ జరిగింది వేరు.పళనిస్వామికి గవర్నర్ పిలుపు తర్వాత చానెల్స్ దృష్టి మొత్తం తమిళ పాలిటిక్స్ మీద పడింది.ఆ విధంగా జగన్ కి పళనిస్వామి షాక్ తగిలినట్టే కదా !

Leave a Reply