పళనికే పట్టాభిషేకం..అన్నాడీఎంకేలో రాజీ ప్రయత్నం?

0
261
palaniswamy chief minister of tamilnadu

Posted [relativedate]

palaniswamy chief minister of tamilnadu
శశికళ శపధం నెరవేరింది.జైలుకెళ్లినా ఆమె అనుకున్నట్టే పళనిస్వామి తమిళనాడు సీఎం గా పట్టాభిషిక్తుడు కాబోతున్నారు.ఈ ఉదయం 11 : 30 ప్రాంతంలో పళనిస్వామి రాజ్ భవన్ వెళ్లారు.గవర్నర్ తో భేటీ అయ్యారు.న్యాయకోవిదులతో చర్చించాక గవర్నర్ పళనిస్వామికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.ఆయన పిలుపు అందుకున్న తర్వాత పళనిస్వామి రాజ్ భవన్ వెళ్లారు. సెంగోట్టైయెన్,దిండిగల్ శ్రీనివాస్ లాంటి నేతలతో కలిసి వెళ్లిన పళని తమకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని మరోసారి విన్నవించారు.ఆయన వాదన మన్నించిన గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకి పళనిస్వామిని ఆహ్వానించారు.బలనిరూపణకి 15 రోజుల గడువు ఇచ్చారు.

దీంతో గౌండర్ సామాజికవర్గానికి చెందిన పళనిస్వామి ముఖ్యమంత్రి కాబోతున్నారు.ఈసాయంత్రంలోగా ఆయన సీఎం గా ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది.మరోవైపు కేంద్రంతో మంచి సంబంధాలున్న అన్నాడీఎంకే సీనియర్ నేత తంబిదురై పార్టీలో సంక్షోభానికి కూడా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.శశి,పన్నీర్ వర్గం మధ్య రాజీకి కొన్ని ఫార్ములాలు వర్క్ అవుట్ చేస్తున్నారు.

palaniswamy chief minister of tamilnadu

Leave a Reply