వేటు వేస్తే మొద‌టికే మోసం?

0
247
palaniswamy plan flop

Posted [relativedate]

palaniswamy plan flop
తమిళనాడు అసెంబ్లీలో బలనిరూపణ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిన సెల్వం వ‌ర్గంపై చ‌ర్య‌లు తీసుకుంటే ప‌రిణామాలు వేరేర‌కంగా ఉంటాయా? విప్ ను ధిక్క‌రించిన సెల్వం వ‌ర్గంపై వేటు వేస్తే చిన్న‌మ్మ ప‌ద‌వికి ఎస‌రు త‌ప్ప‌దా ? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది.

బ‌ల నిరూప‌ణ స‌మ‌యంలో సెల్వం స‌హా 11 మంది ఎమ్మెల్యేలు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఓటేశారు. ఈ నేప‌థ్యంలో అన్నాడీఎంకే విప్ రాజేంద్రన్ …సెల్వం సహా 11 మంది శాసనసభ్యులను పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం పదవుల నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోనున్నారు. సెల్వంపై క‌క్ష సాధింపున‌కు ఇదే స‌రైన త‌రుణ‌మ‌ని ప‌ళ‌ని వ‌ర్గం భావిస్తోంది.

అయితే సెల్వం వ‌ర్గం వాద‌న మ‌రోలా ఉంది. అయితే పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం తమను అనర్హులుగా ప్రకటించే అధికారం శశికళ నాయకత్వంలోని ఆ పార్టీకి లేదంటోంది. అస‌లు పార్టీ ఫిరాయింపుల చ‌ట్ట‌మే త‌మ‌కు వ‌ర్తించ‌ద‌ని వారు గ‌ట్టిగా చెబుతున్నారు. ఎందుకంటే శ‌శిక‌ళ నియామ‌క‌మే పార్టీ నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా జ‌రిగింద‌ని సెల్వం వ‌ర్గీయులు వాదిస్తున్నారు.

ఒక‌వేళ బ‌ల‌వంతంగా త‌మపై వేటు వేస్తే… కోర్టుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని సెల్వం వ‌ర్గీయులు స్ప‌ష్టం చేస్తున్నారు. అదే జ‌రిగితే శ‌శిక‌ళ ప‌ద‌వి కోల్పోతుంద‌ని బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతున్నారు. అంతేకాదు వేటు కూడా తొంద‌ర‌గా వేయాల‌ని వారు కోరుకుంటున్నారు. ఎంత త్వ‌ర‌గా వేటు వేస్తే.. అంత త్వ‌ర‌గా కోర్టుకు వెళ్లి శ‌శిక‌ళ‌కు చెక్ పెడ‌తామంటున్నారు. వారి ఈ వేటు ప‌రిణామాలు ఎక్క‌డికి దారి తీస్తాయో… వెయిట్ అండ్ సీ….!!!

Leave a Reply