14 ఎందుకు..నాలుగు చాలు

0
276
Palaniswamy says to governor no need 15 days time 4 days enough for mlas supporting

Posted [relativedate]

Palaniswamy says to governor no need 15 days time 4 days enough for mlas supporting
పళనిస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించిన తమిళనాడు గవర్నర్ విద్యాసాగరరావు ఆయనకి బలనిరూపణ కోసం 14 రోజుల గడువు ఇచ్చారు.అయితే క్షణానికో రంగు మారుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని పసిగట్టిన పళనిస్వామి ఇంకా అన్ని రోజులు ఆగడం మంచిదికాదని డిసైడ్ అయ్యారు.ఎమ్మెల్యేలకు ఇంకో 14 రోజులు కాపలా కాయడం వల్ల కాదనుకుంటున్న ఆయన బల పరీక్ష వ్యవహారాన్ని త్వరగా తేల్చాలని నిర్ణయించుకున్నారు.14 రోజులెందుకు…నాలుగు రోజులు చాలు అన్నట్టు వచ్చే సోమవారం అసెంబ్లీ లో బలనిరూపణకి పళనిస్వామి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా శాసనసభా సమావేశాలు నిర్వహించబోతున్నారు.ప్రత్యర్థి పన్నీర్ కి ఇక ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని శశికళ సూచన మేరకు పళని ముందుగానే బల నిరూపణకు సై అంటున్నారు.

Leave a Reply