పళనిస్వామి బడ్జెట్ రూ. 700 కోట్లు!!

0
289
palaniswamy spend crores of money to aiadmk mlas for support

Posted [relativedate]

palaniswamy spend crores of money to aiadmk mlas for support
బలపరీక్షలో గెలిచేందుకు పళనిస్వామి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. గెలుపే ధ్యేయంగా బరిలోకి దిగబోతున్నారు. ఎమ్మెల్యేల మద్దతు పొందేందుకు వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని టాక్. బలపరీక్షలో గెలుపుకోసం భారీ బడ్జెట్ ను ఖర్చు పెట్టారని ప్రచారం జరుగుతోంది.

పళనిస్వామి క్యాంపులో దాదాపు 120 మంది ఎమ్మెల్యేలున్నారు. అయినప్పటికీ సొంత క్యాంపులో అసమ్మతి రాకుండా … పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేస్తున్నారట. పళనిస్వామి ఏకంగా 700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని టాక్. ఒక్కో ఎమ్మెల్యేకు 5 కోట్లు ఆఫర్ చేశారట. అందులో సగం డబ్బు ఇప్పటికే ఎమ్మెల్యేల ఇళ్లకు చేరిపోయిందని ప్రచారం జరుగుతోంది.

ఒక్కో ఎమ్మెల్యేకు 5 కోట్ల రూపాయలు నిర్ణయించినా.. కొంతమంది అసంతృప్తులకు 10 కోట్ల దాకా ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారట. రెబల్ ఎమ్మెల్యేలకు కూడా ఇప్పటికే డబ్బులు ఇచ్చారట. డబ్బులు ఆశతోనైనా ఆ ఎమ్మెల్యేలు దారిలోకి వస్తారని పళని ఆశ. ఇలా మొత్తం 700 కోట్ల రూపాయల బడ్జెట్ తో పళనిస్వామి రంగంలోకి దిగుతున్నారని టాక్. ఇంత భారీ బడ్జెట్ సినిమా హిట్ అవుతుందో… లేదా ఫట్ అవుతుందో… త్వరలోనే తేలిపోనుంది.

Leave a Reply