రేపే పళని బలపరీక్ష..కౌంటర్ వేసిన పన్నీర్ వర్గం

0
240
panneer followers counter to pallanisamy

Posted [relativedate]

panneer followers counter to pallanisamy
ఒక్క రోజు గడిస్తే ఏమవుతుందో తెలియని అనిశ్చిత పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం కష్టమని తమిళ సీఎం గా పగ్గాలు చేపట్టిన కొన్ని గంటల్లోనే పళనిస్వామికి అర్ధమైంది.అందుకే బలనిరూపణకి స్పీకర్ ఇచ్చిన గడువుతో సంబంధం లేకుండా రేపే ఆ పరీక్ష ఎదుర్కోవాలని ఆయన నిర్ణయించుకున్నారు.ఇంతకుముందు సోమవారం బలనిరూపణ అనుకున్నప్పటికీ పన్నీర్ వర్గం,డీఎంకె ఎత్తులు ఎక్కడ కొంప ముంచుతాయో అన్న భయం వారికి వుంది.బలపరీక్షకు ముందే జైలుకెళ్లి చిన్నమ్మ దర్శనం చేసుకోవాలనుకున్నా..ఆ పని కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

మరోవైపు పన్నీర్ వర్గం సైతం ఇప్పటికీ తమదైన శైలిలో పావులు కదుపుతోంది.శశికళ,దినకరన్, వెంకటేశన్ ని పార్టీ ప్రాధమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్టు ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ తో ప్రకటన ఇప్పించారు.ప్రజలనుంచి ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచాలని కూడా ట్రై చేస్తున్నారు.ఒక్కో ఎమ్మెల్యేకు ఐదు కోట్లు ఇవ్వడం వల్లే వాళ్ళు శశికళకి వంత పడుతున్నట్టు ప్రచారం చేస్తున్నారు.

Leave a Reply