పన్నీరుకు పల్లకీ రెడీ అయిందా..?

0
611
panneer is ready to win the elections

Posted [relativedate]

panneer is ready to win the electionsతమిళనాడులో ఆర్కేనగర్ ఉపఎన్నిక రద్దవడం, అందుకు ఐటీ రెయిడ్స్ కారణంగా మారడంతో.. అన్నాడీఎంకే రాజకీయాల్లో మళ్లీ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఐటీ దాడుల్లో దొరికిపోయిన ఆరోగ్యమంత్రి విజయ్ భాస్కర్ రాజీనామాకు సీఎం పళనిస్వామి పట్టుబడుతుంటే.. టీటీవీ దినకరన్ మాత్రం కొనాగించాలని కోరుతున్నారు. దీంతో పన్నీర్ సెల్వం మరోసారి పావులు కదుపుతున్నారు. టీటీవీ దినకరన్ ను సాగనంపడానికి.. పార్టీకి పూర్వవైభవం తేవడానికి కలిసి పనిచేద్దామని పళనిస్వామికి పన్నీర్ ఆఫర్ ఇచ్చారట.
మరోవైపు విజయ్ భాస్కర్ రాజీనామా పరిణామాలపై సీఎం పళనిస్వామి సీనియర్లతో తన నివాసంలో భేటీ అయ్యారు. పన్నీర్ వర్గం ప్రతిపాదన విన్న పళనిస్వామి.. ముందు విజయ్ భాస్కర్ ను తొలగించిన తర్వాతే మిగతా విషయాలు ఆలోచిద్దామని చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రిని కచ్చితంగా తొలగించాలని, అవసరమైతే దినకరన్ తో ఢీ అంటే ఢీ అనాలని సీనియర్లు సూచించినట్లు సమాచారం. ఇక ఎట్టి పరిస్థితుల్లో దినకరన్ కు లొంగే ప్రసక్తే లేదని పళనిస్వామి సంకేతాలు పంపుతున్నట్లు తెలుస్తోంది.
అటు పళనిస్వామి సర్కారుపై కూడా ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఎక్కువైంది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు బహిరంగ విమర్శలు, తాజాగా మూడో ఎమ్మెల్యే కూడా అమ్మ పథకాలు సరిగ్గా అమలుకావడం లేదని మండిపడ్డారు. వీరికి అంతర్గతంగా మరో పది మంది మద్దతుందని, వీళ్లంతా పన్నీర్ వైపు చూస్తున్నారని వార్తలొస్తున్నాయి. ప్రభుత్వాన్ని కొనసాగించాలంటే పన్నీర్ తో రాజీపడక తప్పని పరిస్థితి పళనిస్వామికి ఉంది. అదే జరిగితే పన్నీర్ మళ్లీ సీఎం అవుతారా.. లేదంటే పళనిస్వామే కొనసాగుతారా అనేది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply