చుక్క‌లు చూపిస్తున్న సెల్వంసారు!!

0
210
panneer selvam is near to victory

 Posted [relativedate]

panneer selvam is near to victory
ఆర్కే న‌గ‌ర్ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయ‌డానికి శ‌శిక‌ళ వ‌ర్గం వెనుకా ముందు అవుతుంటే.. ప‌న్నీర్ సెల్వం వ‌ర్గం దూసుకుపోతోంది. ముఖ్యంగా సెల్వం సారు.. అన్నీ తానై త‌న వ‌ర్గానికి చెందిన అభ్య‌ర్థి మ‌ధుసూద‌న్ త‌ర‌పున విస్తృత ప్ర‌చారం చేస్తున్నారు. ప‌దునైన విమ‌ర్శ‌ల‌తో చిన్న‌మ్మ వ‌ర్గాన్ని టెన్ష‌న్ పెడుతున్నారు. ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి, ఆయ‌న కేబినెట్ స‌భ్యుల‌పై విరుచుకుప‌డుతున్నారు. ప‌ళ‌నిస్వామి, ఆయ‌న టీంలో 10మంది దాకా అవినీతిప‌రులేన‌ని… త్వ‌ర‌లో వారి చిట్టా బ‌య‌ట‌పెడ‌తాన‌ని స‌వాల్ విసురుతున్నారు.

అస‌లే ఎన్నిక‌ల టైమ్. ఆర్కే న‌గ‌ర్ లో చిన్న‌మ్మ వ‌ర్గానికి జ‌నం నుంచి రెస్పాన్స్ ల‌భించ‌డం లేదు. ఈ స‌మ‌యంలో ఆధారాల‌తో స‌హా ప‌న్నీర్ సెల్వం … ఏదైనా చిట్టా బ‌య‌ట‌ప‌డితే ప‌రిస్థితి ఏంటని చిన్న‌మ్మ టెన్ష‌న్ ప‌డుతున్నారట‌. అదే జ‌రిగితే ఎన్నిక‌ల్లో ఓట‌మి ఖాయ‌మ‌వ్వ‌డంతో పాటు ప్ర‌భుత్వ ఉనికే ప్ర‌శ్నార్థ‌క‌మ‌య్యే ప‌రిస్థితి తలెత్తే ప్ర‌మాద‌ముంది. ఇవ‌న్నీ ఊహించుకొని దిన‌క‌ర‌న్ ప్ర‌చారంలో దూకుడు త‌గ్గించార‌ట‌. ఏదో నామ్ కే వాస్తేగా ప్ర‌చారం చేస్తూ మ‌మ అనిపిస్తున్నార‌ట‌. ఎందుకంటే గ‌ట్టిగా మాట్లాడితే సెల్వం … త‌న‌పై ఎక్క‌డ విమ‌ర్శ‌లు చేస్తారోన‌ని దిన‌క‌ర‌న్ భ‌య‌ప‌డుతున్నార‌ని టాక్.

అటు డీఎంకే పరిస్థితి కూడా ఏమీ బాగా లేదు. ఆర్కే న‌గ‌ర్ లో ఆ పార్టీకి పెద్ద‌గా ప‌ట్టు లేదు. అయితే సెల్వం, చిన్న‌మ్మ వ‌ర్గాల మ‌ధ్య పోరులో .. చీలిక ఓట్లు త‌న‌కు ప‌డ‌తాయ‌ని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే క్యాంపెయిన్ లోనూ డీఎంకే పెద్ద‌గా జోరు చూపించ‌డం లేదు. ఇటు జ‌య‌ల‌లిత మేన‌కోడ‌లు దీపా జ‌య‌కుమార్ ప‌రిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఇంటిపోరుతో ఆమె ఇమేజ్ చాలావ‌ర‌కు డ్యామేజ్ అయ్యింది. దీంతో జ‌నం ఆమెను న‌మ్మడం క‌ష్టేమ‌న‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ముగ్గురు ప్ర‌త్య‌ర్థులు దిన‌క‌రన్, దీపా జ‌య‌కుమార్, డీఎంకే… డిఫెన్స్ లో ప‌డిపోవ‌డం వ‌ల్ల… ఇప్పుడు ప‌న్నీర్ సెల్వం ఇంకా వేగం పెంచారు. తెలుగు ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఉన్న ఆర్కే న‌గ‌ర్ లో మ‌ధుసూద‌న్ ను గెలిపించుకోవ‌డానికి అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లో విజ‌యం సాధించి ప్ర‌త్య‌ర్థుల‌కు షాకిస్తాన‌ని చెబుతున్నారు. మ‌రి ఓట‌ర్లు క‌రుణించేది ఎవరినో చూడాలి!!

Leave a Reply