సెల్వం రాజీనామా చెల్ల‌దా?

0
473
panneer selvam resignation cancelled

 Posted [relativedate]

panneer selvam resignation cancelled
త‌మిళ‌నాడులో ప‌న్నీర్ సెల్వం ముఖ్య‌మంత్రి కావాల‌ని ఆయ‌న కంటే ఎక్కువ‌గా కోరుకుంటున్న పార్టీ ఏదైనా ఉంటే అది బీజేపీనే. శ‌శిక‌ళ కూడా అడ్డు తొల‌గిపోయింది కాబ‌ట్టి… ఇక సెల్వంను సీఎంసీటు ఎక్కించ‌డానికి కేంద్రం కూడా చాలా సీరియ‌స్ గా దృష్టి పెట్టింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను ఈజీగా ఎలా ముఖ్య‌మంత్రిని చేయాల‌న్న దానిపై స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంద‌ట‌. అందులో భాగంగా కొత్త వాద‌న తెర‌పైకొచ్చింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప‌న్నీర్ సెల్వం తాను రాజీనామా చేసే స‌మ‌యంలో ఫ్యాక్స్ ద్వారా గ‌వ‌ర్న‌ర్ కు పంపారు. అత్యున్న‌త ప‌ద‌విలో ఉన్న ముఖ్య‌మంత్రి…. ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖ పంప‌డం చెల్ల‌ద‌ట‌. తాజాగా ఈ ప్ర‌చారం జ‌రుగుతోంది. సెల్వం వ‌ర్గీయులు అప్పుడే ఈ ప్ర‌చారం మొద‌లుపెట్టేశారు. అటు బీజేపీ ఆలోచ‌న కూడా ఇదేన‌ట‌. దీంతో కొంప‌దీసి సెల్వం రాజీనామా చెల్ల‌ద‌ని ప్ర‌క‌టించేస్తారా అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఒక‌వేళ నిజంగానే సెల్వం రాజీనామా చెల్ల‌క‌పోతే ఆయ‌న పంట పండిన‌ట్టే. బ‌ల నిరూపణ లాంటివేవీ ఉండ‌వు. ప‌ళనిస్వామి పోరు ఉండ‌దు. ప‌న్నీర్ ఈజీగా ముఖ్య‌మంత్రి అయిపోతారు. అయితే అది అంత ఈజీ కాక‌పోవ‌చ్చ‌న్న‌ది విశ్లేష‌కుల భావ‌న. ఎందుకంటే ఒక్క‌సారి గ‌వ‌ర్న‌ర్ … రాజీనామాను ఆమోదిస్తే… అదే ఫైన‌ల్. ఆ నిర్ణ‌యంలో మార్పు క‌ష్ట‌మే. కాబ‌ట్టి ఏదైనా అద్బుతం జ‌రిగితే త‌ప్ప ఈ ప‌రిస్థితి ఉత్ప‌న్నం కాక‌పోవ‌చ్చ‌ని టాక్.

Leave a Reply