చిన్నమ్మకి చిప్పే గతి …మన్నార్ గుడి మాఫియాకి చితి

0
332
panneerselvam and palaniswamy merger plans sasikala in danger zone in aiadmk party

Posted [relativedate]

panneerselvam and palaniswamy merger plans sasikala in danger zone in aiadmk party
అన్నాడీఎంకే లో చీలికలు,పీలికలు ఇకపై ఉండవేమో.అమ్మ తర్వాత తానేనంటూ పార్టీ పెత్తనం తీసుకున్న చిన్నమ్మని బలి ఇచ్చి పార్టీని ఏకతాటిపైకి తెచ్చేందుకు రంగం సిద్ధమైంది.సీఎం పళనిస్వామి,మాజీ సీఎం పన్నీర్ సెల్వం వర్గాలు ఇప్పటికే ఈ అంశం మీద చర్చలు మొదలెట్టాయి. పార్టీ సీనియర్ నేతలు తంబిదురై,సెంగోట్టైయెన్ లు రెండు వర్గాల మధ్య సంప్రదింపులకు వారధిగా నిలుస్తున్నారు.ఆర్కే నగర్ ఉప ఎన్నికల రద్దుతో పళనిస్వామి వర్గానికి తత్వం బోధపడింది. కేంద్రం ఇంతగా వేటాడుతున్న చిన్నమ్మ,ఆమె మేనల్లుడు దినకరన్ ని పట్టుకుని వేలాడితే తమ భవిష్యత్ కూడా నాశనం అవుతుందని సీఎం పళనిస్వామి,మంత్రివర్గ సభ్యులు గుర్తించారు.ఎమ్మెల్యేలు కూడా అదే అభిప్రాయంతో వున్నారు.ఈ పరిస్థితుల్లో పళనిస్వామి స్వయంగా మాజీ సీఎం పన్నీర్ సెల్వం కి ఫోన్ చేసినట్టు తెలుస్తోంది.పళనిస్వామి ఆఫర్ కి పన్నీర్ ఓకే చెప్పినా ఒకే ఒక్క షరతు పెట్టారంట.అదే..చిన్నమ్మ,దినకరన్ ,యావత్ మన్నార్ గుడి మాఫియా ని పార్టీకి దూరంగా పెట్టడం.

పన్నీర్ సెల్వం షరతుకి అందరం మాట్లాడుకుని చెప్తామని పళనిస్వామి జవాబు ఇచ్చాడట. ఆ జవాబు కోసమే పన్నీర్ ఇప్పుడు ఎదురు చూస్తున్నారు.తన షరతుకి పళని వర్గం ఓకే అంటే పన్నీర్ ఈసారి పార్టీ ప్రధాన కార్యదర్శి హోదా లోకి వస్తారు.సీఎం గా పళనిస్వామి కొనసాగుతారు.ఇలా జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని భావించే దినకరన్ కూడా రాజీకి వచ్చారట.తనను దూరంగా పెట్టినా శశికళ పదవి అలాగే కొనసాగించాలని రెండు వర్గాలకి దండం పెట్టి మరీ కోరుతున్నారట.అయినా శశికళ విషయంలో పన్నీర్ వెనక్కి తగ్గడం లేదట.పన్నీర్ ప్లాన్ సక్సెస్ అయితే అన్నాడీఎంకే లో చిన్నమ్మకి చిప్పే గతి అవుతుంది.మన్నార్ గుడి మాఫియా కి చితి రగులుతుంది.

Leave a Reply