అంతా రహస్యం..తమిళ సభలో విధ్వంసం

0
340

Posted [relativedate] 

panneerselvam and stalin demand to secrete voting for supporting mlas in tamilnadu assembly
తమిళనాడు సీఎం పళనిస్వామి బలనిరూపణ ఎపిసోడ్ చిదంబర రహస్యాన్ని తలపిస్తోంది. సభ ఎలా జరుగుతుందో..బలపరీక్షలో ఎవరెటు ఓటు వేస్తారో అని చూసేందుకు టీవీ ల ముందు కూర్చున్న వారికి ఆదిలోనే షాక్ తగిలింది.అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాల్ని నిలిపేస్తూ స్పీకర్ ధన్ పాల్ నిర్ణయం తీసుకున్నారు.ఏదో జరుగుతుందని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఆ అనుమానమే నిజమైంది. అసెంబ్లీ మొదలుకాగానే యుద్ధ వాతావరణం తలపించింది.రహస్య ఓటింగ్ నిర్వహించాలని పన్నీర్ సెల్వం వర్గం,డీఎంకే శాసనసభ్యులు డిమాండ్ చేశారు.స్పీకర్ అందుకు నిరాకరించడంతో వాళ్ళు సభలో విధ్వంసం సృష్టించారు.దీంతో ఈ గందరగోళం మధ్య ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలు విలేకరులకు వినపడకుండా అక్కడున్న ఆడియో వ్యవస్థని కూడా స్పీకర్ ఆపివేయించారు.ఆ తర్వాత గొడవ తీవ్ర రూపం దాల్చింది.స్పీకర్ ని విపక్ష ఎమ్మెల్యేలు ఘోరావ్ చేశారు.స్పీకర్ ఆదేశాలతో మొదలైన ఓటింగ్ ప్రక్రియకు తీవ్ర అంతరాయం కలిగింది .దీంతో సభని ఒంటిగంటకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్న స్పీకర్ ధన్ పాల్ మార్షల్స్ రక్షణతో సభ నుంచి బయటికి వెళ్లిపోయారు.

డీఎంకే ఎమ్మెల్యే సెల్వం ఈ అల్లర్ల మధ్య దూసుకెళ్లి ఏకంగా స్పీకర్ చైర్ లో కూర్చున్నారు.పన్నీర్ వర్గీయులు ఎమ్మెల్యేల్ని బంధించి వారితో ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించారు.ఈ నేపథ్యంలో సభలో జరిగినదానిపై తలోరకంగా బయటికి చెబుతున్నారు.అసలు బలపరీక్షని అంత రహస్యంగా ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందనే దానిపై ఎవరూ బయటికి మాట్లాడ్డం లేదు.

Leave a Reply