అమ్మ స్థానంలో చిన్నమ్మ….పన్నీర్ నోటివెంటే

     Posted [relativedate]    

panner statement about sashikala
శశికళ కల నెరవేరింది .అమ్మ జయమ్మ స్థానంలో అన్నాడీఎంకే అధినేత్రిగా కూర్చోవాలని ఎన్నో ఏళ్లుగా వేసిన ఎత్తులు ఫలించాయి.ఆమె ఎన్నికకు అడ్డుగా ఉండొచ్చని భావించిన సీఎం పన్నీర్ సెల్వమ్ స్వయంగా తన నోటితో శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారని ప్రకటించారు .అది చిన్నమ్మ దెబ్బంటే అనుకుంటూ ఆమె అనుచరవర్గం ఉబ్బితబ్బిబ్బవుతోంది .

ఎంతో హాట్ హాట్ గా జరుగుతుందని దేశమంతా భావించిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం కూల్ గా జరిగిపోయింది .ఈ సమావేశానికి శశికళ వ్యతిరేకులే కాదు ఏ పక్షానికి చెందని వారిని కూడా రాకుండా శశికళ ఓ వ్యూహం ప్రకారం వ్యవహరించారు .సీనియర్ నాయకుడు మధుసూదన్ పర్యవేక్షణలో జరిగిన భేటీలో శశికళకి ఏకగ్రీవంగా పార్టీ బాధ్యతలు అప్పగించారు .దీంతో పాటు మొత్తం 14 తీర్మానాలని సమావేశం ఆమోదించింది. జయ పుట్టిన రోజున జాతీయ రైతు దినోత్సవం పాటించాలని ,ఆమెకి భారత రత్న ఇవ్వాలని ,నోబెల్ శాంతి ,మెగసెస్సేఅవార్డులకు జయ పేరు ప్రతిపాదించాలన్నా తీర్మానాలు ముఖ్యమైనవి .

Leave a Reply