అమ్మాడీఎంకే పేరుతో సెల్వం కొత్త పార్టీ!!

0
255
pannerselvam new party as ammadmk

Posted [relativedate]

pannerselvam new party as ammadmk
త‌మిళ‌నాడు మాజీ సీఎం ప‌న్నీర్ సెల్వం కొత్త రాజ‌కీయ పార్టీ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న చేయబోతున్నార‌ని లీకులు వ‌స్తున్నాయి. పార్టీ పేరు, గుర్తు కూడా ఖ‌రారైపోయింద‌న్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.

నిజానికి ప‌న్నీర్ సెల్వం పార్టీని ఒక ఆరునెల‌లు ఆగి పెట్టాల‌ని అనుకున్నార‌ట‌. కానీ బ‌లప‌రీక్ష‌లో ప‌ళ‌నిస్వామికి వ్య‌తిరేకంగా ఓటేసిన నేప‌థ్యంలో సెల్వం స‌హా 11 మంది ఎమ్మెల్యేలపై స్పీక‌ర్ ధ‌న‌పాల్ అనర్హ‌త వేటు వేయ‌బోతున్నార‌ని స‌మాచారం. ఎందుకంటే పార్టీ విప్ ను ఆయ‌న ధిక్క‌రించిన‌ట్టు అన్నాడీఎంకే ఫిర్యాదు చేసింది. దీంతో ఆయ‌న‌పై అన‌ర్హ‌త ఖాయ‌మ‌ని ప్రచారం జ‌రుగుతోంది. వేటు ప‌డితే శాస‌న‌స‌భ నుంచి ఆయన బ‌హిష్క‌ర‌ణ‌కు గుర‌వుతారు. ఆరునెల‌ల్లో ఉప ఎన్నిక‌లు వ‌చ్చేస్తాయి.

ఉప ఎన్నిక‌ల్లో తాను నిల‌బ‌డ‌లాంటే ఏదో ఒక పార్టీ త‌ర‌పున పోటీ చేయాల్సిందే. ఇత‌ర పార్టీల త‌ర‌పున ఆయ‌న పోటీ చేస్తే జ‌నామోదం ల‌భించ‌దు. అదే కొత్త పార్టీ పెడితే క‌లిసొచ్చే అవ‌కాశ‌ముంది. అందుకే కొత్త పార్టీపై ఇప్ప‌టికే చ‌ర్చ‌లు చేశార‌ట సెల్వం. అమ్మాడీఎంకే పేరుతో కొత్త పార్టీ పెట్ట‌బోతున్నార‌ట‌. ఇక గుర్తు విష‌యంలోనూ క్లారిటీ వ‌చ్చేసింద‌ని టాక్.

అన‌ర్హ‌త వేటు వేయ‌క‌ముందే… పార్టీని ప్ర‌క‌టించి జ‌నంలోకి వెళ్లాల‌న్న‌ది సెల్వం ప్లాన్. అమ్మాడీఎంకే పేరుతో జ‌నంలో త‌న‌కున్న సానుభూతిని త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకునేందుకు ఆయ‌న‌ సిద్ధంగా ఉన్నార‌ట‌. మ‌రి ఈ అమ్మాడీఎంకే … త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో ఎలాంటి మార్పుల‌కు కార‌ణ‌మ‌వుతుంద‌న్న‌ది సెల్వం వ్యూహ‌ర‌చ‌న‌పై ఆధార‌ప‌డి ఉంటుంది!!!

Leave a Reply