బొప్పాయితో బోలెడు ప్రయోజనాలు..

0
873

 

 papaya fruit uses

*బొప్పాయి….. నారింజ,పసుపు రంగుల మిశ్రమంతో మెరిసిపోయే బొప్పాయి ఆరోగ్య ప్రదాయిని ఆయుర్వేదంలో పండుకి విశిష్ట స్థానం ఉంది.
*బొప్పాయి వాత,కఫ దోషాల్ని అణచివేస్తుంది.
*బాగా పండిన బొప్పాయి పిత్త దోషం ప్రకోపించకుండా నివారిస్తుందది .
*బొప్పాయి లో విటమిన్ A,విటమిన్ B కాంప్లెక్,విటమిన్ C విరివిగా లభిస్తాయి.
*సోడియం ,పొటాషియం కూడా బొప్పాయి ద్వారా లభిస్తాయి.
*ఎన్నో ఖనిజాలు,జీర్ణక్రియ సహకరించే ఎంజైమ్ లు ,విటమిన్ల సమ్మేళనంతో బొప్పాయి సహజ ఔషధం.
*రోజువారీ ఆహారంలో బొప్పాయి భాగమైతే మీశక్తి సామర్ధ్యాలు పెరుగుతున్నట్టే..
*బీపీ,షుగర్ నియంత్రణలో బొప్పాయి ఎంతగానో దోహదపడుతుందది.
*బొప్పాయిలో ఎంజైమ్ లు జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చూస్తాయి.దీంతో తీసుకున్న ఆహారం పూర్తిగా శరీరానికి వంట పడుతుంది.
*రోజు వాటి వినియోగం వల్ల జీర్ణాశయ సమస్యలు తొలిగిపోతాయి.
*బొప్పాయి పాలలో విషతుల్యాన్ని బయటకు పంపే శక్తి ఉంది.
*బొప్పాయిపాలు వ్యాధికారక, బ్యాక్టీరియాని నిర్మూలిస్తుంది.
*నోరు,నాలిక మీద పుండ్లకు బొప్పాయి పాలు ఔషధంగా పని చేస్తుంది.
*మహిళా రుతుక్రమ సమస్యలకు బొప్పాయి దివ్య ఔషధం.
*బొప్పాయి విత్తనాల పొడిని వేడి నీళ్లలో కలిపి తాగితే బహిష్టా సమయంలో రక్త విసర్జన సాఫీగా జరుగుతుంది.
*బొప్పాయి సేవనం వల్ల బాలింతలకు బాగా పాలు పడతాయి.

bp7

Leave a Reply