కృష్ణ వేణి తీరంలో పారా స్లైడింగ్..

0
540
2003110401651701

Posted [relativedate]

Related image

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి సమీపం లోని కృష్ణ వేణి నదీ తీరం లో ఈ రోజు రేపు ..ఓ సాహసక్రీడ జరగ బోతోంది అదేమిటంటే కృష్ణ నది నీటి పై బోట్ లో వెళ్లడం లాంటి సింపుల్ సాహసం ఐతే కాదు ఏకంగా ఓ బెలూన్ కి వేలాడుతూ ఎగరడం…సాధారణం గా ఎలాంటివి మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం.ఐతే ఇపుడు నేషనల్‌ అడ్వంచర్‌ ఫౌండేషన్‌, విజయవాడ అడ్వంచర్‌ క్లబ్‌(వీఏసీ) సంయుక్త ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ పారా స్లయిడింగ్ ని.నేషనల్‌ అడ్వంచర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఇలాంటి సాహస క్రీడలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తుంటారు. గాలిలో, భూమిపై, నీటిలో సాహసక్రీడలను వీరు నిర్వహిస్తుంటారు. దీనికోసం ప్రత్యేకంగా తర్ఫీదు పొందిన నిపుణులు ఉంటారు. ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసిన అనుభవం ఉన్నవాళ్లు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. వీఏసీ సభ్యులు సైతం రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ కలిసి.. తొలిసారి పారాస్లైడింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

వారధి వద్ద ఉన్న శివాలయం వద్ద ఈ సాహసక్రీడ నిర్వహిస్తున్నారు. పారాస్లైడింగ్‌లో రెండు రకాలుంటాయి. బోటుకు తాడు ద్వారా బెలూన్‌ను వేలాడదీసి.. నీటిపైన ఎగురుతూ వెళ్లేది ఒకటి. రెండోది రోడ్డు, మైదానాలు, తీరప్రాంతాల్లో ట్రక్కుకు వెనుక తాడు కట్టి బెలూన్‌ను వేలాడదీసి.. భూమిపై ఎగురుతూ వెళ్లేది ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చేది రెండో రకం.దీంతో రెండు రోజుల్లో కనీసం 200 మందికి అవకాశం కల్పించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. దీని కోసం ముందుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. సాహసాలు చేయాలని భావించే ఎవరైనా గాలిలో ఎగిరేందుకు సిద్ధమవ్వొచ్చని వెళ్లడించారు. రెండు రోజులూ ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 4వరకూ అందుబాటులో వుంటుందట …

Leave a Reply