Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రకాశం జిల్లా టీడీపీ రాజకీయాల్లో నిత్య సంకటంగా మారినవి రెండు నియోజకవర్గాలు.అందులో కరణం బలరాం,గొట్టిపాటి రవికుమార్ వర్గాలు తలపడే అద్దంకి మొదటిదికాగా,ఆమంచి కృష్ణ మోహన్,పోతుల సునీత వర్గాలు ఢీకొంటున్న చీరాల రెండోది.ఈ నియోజకవర్గాల్లో రాజీ కోసం అసంతృప్త నేతలకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చాక సమస్య తగ్గకపోగా ఇంకాస్త పెరిగింది.సీఎం చంద్రబాబు,జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి నారాయణకి ఈ సమస్య కొరకరాని కొయ్యగా మారింది.అయితే బాపట్ల పార్లమెంటరీ ఇన్ ఛార్జ్ పరిటాల సునీత ఈ సమస్య పరిష్కారం కోసం ఓ రాజీ ఫార్ములా తయారు చేశారు.దాన్నే జిల్లా అంతటా అమలు చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారు . అయితే ఆ ఫార్ములా వికటిస్తే అన్న భయం కూడా లేకపోలేదు.ఇంతకీ ఆ ఫార్ములా ఏంటో చూద్దాం..
ప్రకాశం జిల్లా ముఖ్యంగా అద్దంకి ,చీరాల నియోజకవర్గాల్లో రాజీ ఫార్ములా ప్రకారం అధికారాలు పంపకం చేయాలి.ప్రస్తుతం అనధికారికంగా ఎమ్మెల్యేల కనుసన్నల్లో నడుస్తున్న వివిధ పధకాల లబ్ది దారుల ఎంపిక సహా ప్రభుత్వ పరంగా జరిగే ప్రతిపనిలోనూ రెండో వర్గానికి కూడా భాగస్వామ్యం కల్పించాలి.ఇద్దరూ ఒకే మాట మీదికి వచ్చాక మాత్రమే ఆ జాబితాకు ఓకే చెప్పాలి. ఓ రకంగా చెప్పాలంటే ఇది ఎమ్మెల్యేల అడ్జికారాల్లో కొత్త వేసి ఎమ్మెల్సీలకి పంచడం లాంటిదే.ఈ ఫార్ములాకి చంద్రబాబు ఓకే చెపితే నియోజకవర్గాల్లో సమస్యలు తగ్గకపోగా పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే సదరు ఎమ్మెల్యేలు లోకేష్ వద్ద తమ వాదన వినిపించినట్టు తెలుస్తోంది.పరిటాల సునీత ఫార్ములా చూడ్డానికి బాగుంది కానీ ప్రాక్టికల్ గా సాధ్యం కాదన్న మాటే ప్రకాశం జిల్లా తెలుగు తమ్ముళ్లలో ఎక్కువగా వినిపిస్తున్న మాట.బాబు విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక పరిటాల ఫార్ములాపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం వుంది.