ఎన్టీఆర్ చుట్టూ మూడుముక్కలాట?

 Posted October 30, 2016

party leaders around ntr

జనతా గ్యారేజ్ వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ఓ మంచి సినిమా చేయాలని ఎన్టీఆర్ ఎంతో సహనంగా వేచి చూస్తున్నాడు.ఓ మంచి కధ..ఓ మంచి దర్శకుడి కోసం ఇంతలా వెయిట్ చేసే ఓపిక ఎన్టీఆర్ కి ఎక్కడనుంచి వచ్చింది?గతం నేర్పిన పాఠాలతో వచ్చి ఉంటుంది.అయితే తారక్ ఇంత సహనంగా ఉండగలదని అయన సన్నిహితులకు కూడా ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది.ఎదురుగా జరుగుతున్న మార్పుని గుర్తించడంలో కాస్త ఏమరుపాటు సహజమే కాబోలు.ఇంతగా ఎదురుచూసి చేసిన సినిమా ఆడుతుందోలేదో చెప్పలేముగానీ..అయన సహనం మాత్రం వృధా పోదు.అది ఒక్క సినీ రంగానికే కాదు ..రాజకీయరంగానికి కూడా వర్తిస్తుంది.
                  రాజకీయాల్లో తొందరపాటు పనికిరాదని టీడీపీ అనుభవం ఎన్టీఆర్ కి ఇప్పటికే ఓ పాఠం నేర్పించింది.అందుకే అయన మౌనంగా వుంటున్నారు.ఓ రకంగా చెప్పాలంటే ఇక్కడా ఎదురు చూపులే.అయినా దానికి తగ్గ ప్రతిఫలం కనిపిస్తోంది.హరికృష్ణని పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా ఎన్టీఆర్ ని దగ్గర చేర్చుకోవాలని వైసీపీ అధినేత జగన్ తహతహలాడుతున్నారు.ఆ దిశగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.ఇక జనసేన అధినేత పవన్ సైతం ఎన్టీఆర్ కి దగ్గర అయితే టీడీపీ,వైసీపీ లకి దీటైన సామాజిక సమీకరణాలు సాధ్యమని భావిస్తున్నారు. ఈ పరిణామాలు గమనిస్తున్న టీడీపీ లోని ఓ వర్గం కూడా ఎన్టీఆర్ ని దూరం చేసుకోవద్దని బాబు చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతున్నారట. ఈ విషయాలన్నీ ఎన్టీఆర్ ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయట.ఒకప్పుడు ఏమి ఆశించకుండా భేషరతుగా పార్టీ కోసం పని చేస్తే దక్కని గౌరవ మర్యాదలు ఇప్పుడు మౌనంగా వుంటుంటే వస్తున్నాయి అనుకుంటున్నారు.అది మౌనం,సహనం కలగలిస్తే దక్కుతున్న గౌరవం.సేవ కన్నా తగిన సమయం లో స్పందించడం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా పనికొస్తుంది..పని చేస్తుంది.ఏదేమైనా ఈ రాజకీయ మూడుముక్కలాటలో ఎన్టీఆర్ ఏ కార్డు ని పిక్ చేసుకుంటాడో?ఎవరిని డిస్కార్డ్ చేస్తాడో?షో తిప్పుతాడో లేదో వేచి చూద్దాం!

SHARE