జబర్దస్త్‌, పటాస్‌లకు కాలం చెల్లినట్లే..!

0
399
patas and jabardasth tv shows will be ban

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

patas and jabardasth tv shows will be ban
ఈటీవీలో గత నాలుగు సంవత్సరాలుగా ప్రసారం అవుతున్న జబర్దస్త్‌తో పాటు, ఈటీవీ ప్లస్‌లో దాదాపు రెండు సంవత్సరాలుగా ప్రసారం అవుతున్న పటాస్‌లకు భారీ టీఆర్‌పీ రేటింగ్‌ రావడంతో పాటు, ఆ రెండు షోలపై భారీగా విమర్శలు వస్తున్నాయి. ఈ సమయంలోనే పలువురు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా కూడా ఆ షోల్లో బూతు మాత్రం తగ్గడం లేదు. కొన్ని సార్లు కుటుంబ సభ్యులు కలిసి చూడలేనంతగా ఆ కార్యక్రమం బూతు మయం అయ్యింది. పిల్లలతో కూడా వారు చేయించే బూతు అసహ్యంను కలిగిస్తుంది.

తాజాగా ఈ రెండు షోలను బ్యాన్‌ చేయాల్సిందిగా సెన్సార్‌ బోర్డు సభ్యుడు ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ షోలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. ఇప్పటికే ఈ రెండు షోలకు నోటీసులు పంపించడం జరిగింది. షో ద్వారా అశ్లీలంగా ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదు అందింది. దీనిపై స్పందన తెలియజేయాల్సిందిగా రెండు షోలకు నోటీసులు అందాయి. తాజా పరిణామాలు చూస్తుంటే మెల్ల మెల్లగా ఈ రెండు కార్యక్రమాలను కూడా నిలిపేయాలనే నిర్ణయానికి మల్లెమాల వారు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయమై మల్లెమాలపై ఈటీవీ యాజమాన్యం ఒత్తిడి తీసుకు వస్తుంది. ప్రస్తుతం ఆ కార్యక్రమాలను ముగించేసి, కొత్త ఎపిసోడ్‌లను చిత్రీకరించకుండా, వాటి స్థానంలో కొత్తగా ఏమైనా ప్లాన్‌ చేయాలని భావిస్తున్నారు.

Leave a Reply