యాక్టింగ్ ఆఫర్లతో ఖుషి ఫేమ్ డైరెక్టర్ ఎస్ .జె.సూర్యా పవన్ సినిమా వదులుకొని వెళ్ళిపోయాడు.కానీ మళ్ళీ ఖుషీ కాంబినేషన్ సెట్ అవుతోంది .ఈ సారి ఖుషి నిర్మాత ఏ .ఎం .రత్నం సూర్యా బ్యానర్ కింద పవన్ తో సినిమా తీయబోతున్నాడా? . ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్న పవన్, ఈ ఫిల్మ్ తర్వాత చేయబోయే ప్రాజెక్ట్‌ను కూడా ముందుగానే రెడీ చేసుకున్నారు .
తమిళనాడులో సూపర్‌హిట్ అయిన అజిత్ ‘వేదాళం’ సినిమా కథ పట్ల పవన్ మక్కువ చూపుతున్నట్టు టాక్. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం పవర్‌స్టార్‌తో ఈ సినిమాను రీమేక్ చేయడానికి సంప్రదింపులు చేస్తున్నారు. మరోపక్క పవన్ ఇమేజ్ కు తగ్గట్టుగా కథకు కాస్త మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. ఈ రీమేక్ కు తమిళ దర్శకుడు ఆర్.టి.నేసన్ దర్శకత్వం వహించే అవకాశం ఉంది. నేసన్ టేకింగ్‌పై పవన్ ఆసక్తి చూపుతున్నారట. ఆమధ్య విజయ్, మోహన్ లాల్ ల కాంబినేషన్లో ఈయన ‘జిల్లా’ చిత్రాన్ని రూపొందించాడు. ఆ సినిమా మంచి వసూళ్లు సాధించి.. సూపర్‌హిట్స్ లిస్ట్‌లో చేరింది.